సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. కార్తీక్ దండు దర్శకుడిగా బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్. తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌కి సన్నద్ధమవుతుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను మార్చి 1న విడుదల చేస్తున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గారుప్రత్యేకంగా ఈ టీజర్‌ను వీక్షించారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉందని ఎంటైర్ యూనిట్‌ను ఆయన అప్రిషియేట్ చేస్తూ.. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలన్నారు. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది హీరో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గారు మా విరూపాక్ష ట్రైలర్‌ను చూశారు. ఆయనకెంతో నచ్చింది. విజువల్స్, బీజీఎం అన్నీ బావున్నాయని తేజ్ తో సహా ఎంటైర్ టీమ్‌ను అప్రిషియేట్ చేశారు. ఈ టీజర్ ని మొట్టమొదటగా ఆయనకి చూపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన్నుంచి వచ్చిన ప్రశంసలు మాకెంతో ఎనర్జీని ఇచ్చాయి. ఇప్పటి వరకు తేజ్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన మూవీ ఇది. సరికొత్తగా ఉంటుంది. ఏప్రిల్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
నటీనటులు:
సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
దర్శకత్వం: కార్తీక్ దండు
సినిమాటోగ్రాఫర్ : శ్యామ్‌దత్ సైనుద్దీన్
మ్యూజిక్ డైరెక్టర్: బి.అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: సతీష్ బి.కె.ఆర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి
పి.ఆర్.ఓ: వంశీ కాకా, మధు మాడూరి