‘సుబ్రహ్మణ్య’, ప్రీ-లుక్ పోస్టర్ స్పెల్‌బైండ్స్.

Must Read

ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేసేందుకు సెకెండ్ టైమ్ మెగాఫోన్ పట్టారు. “సుబ్రహ్మణ్య” టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ప్రతిష్టాత్మకంగా ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ‘గుణ 369’ సక్సెస్ తర్వాత తర్వాత, సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ జానర్‌లో ప్రొడక్షన్ హౌస్‌కి తొలి చిత్రంగా నిలిచింది. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ప్రొడక్షన్ హౌస్ సుబ్రహ్మణ్య ప్రీ-లుక్‌ను రివిల్ చేసింది. పోస్టర్ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫాంటసీ వరల్డ్ లోకి స్నీక్ పీక్‌ను అందిస్తుంది. మూవీ ఆర్ట్‌వర్క్ గ్రాండియర్ గా వుంది. ఈ స్పెల్‌బైండింగ్ ప్రీ లుక్ సినిమాపై ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది.

ప్రీమియం లార్జ్ ఫార్మాట్, IMAX థియేటర్‌లలోని ప్రేక్షకులకు అడ్వంచర్ థ్రిల్‌ను అందించడానికి ఈ చిత్రాన్ని బిగ్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ విజువల్, ఎమోషనల్ ట్రీట్‌గా అద్భుతమైన కథతో సెట్ చేయబడింది.

ఈ చిత్రం ఇప్పటికే 60% నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముంబయిలోని ప్రముఖ రెడ్ చిల్లీస్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రముఖ స్టూడియోలలో VFX & CGI పనులు జరుగుతున్నాయి.

సుబ్రహ్మణ్య సినిమా టెక్నికల్‌గా ఉన్నతంగా ఉండబోతుంది, దీనికి టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. కెజిఎఫ్, సాలర్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, విఘ్నేష్ రాజ్ సినిమాటోగ్రాఫర్. విజయ్ ఎం కుమార్ ఎడిటర్. సప్త సాగరదాచే & చార్లీ 777 ఫేమ్ ఉల్లాస్ హైదూర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్.

పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: అద్వాయ్

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: SG మూవీ క్రియేషన్స్
సమర్పణ: శ్రీమతి ప్రవీణ కడియాల & శ్రీమతి రామలక్ష్మి
నిర్మాతలు: తిరుమల్ రెడ్డి & అనిల్ కడియాల
దర్శకత్వం: పి.రవిశంకర్
సంగీతం: రవి బస్రూర్
డిఓపి: విఘ్నేష్ రాజ్
ఎడిటర్: విజయ్ ఎం కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: ఉల్లాస్ హైదూర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News