యంగ్ హీరో సుహాస్ బర్త్ డే సందర్భంగా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా నుంచి పోస్టర్ రిలీజ్
కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి హిట్ చిత్రాలతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం సుహాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రబృందం.
కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సుహాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా టీజర్ ను త్వరలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
నటీనటులు – సుహాస్, జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు
టెక్నికల్ టీమ్ –
సంగీతం – శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్,
ఎడిటింగ్ – కొదాటి పవన్ కల్యాణ్
పీఆర్వో – జీఎస్ కే మీడియా
బ్యానర్స్ – జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
రచన దర్శకత్వం – దుశ్యంత్ కటికినేని