పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చంద్రేశ్వర

శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి ,ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘చంద్రేశ్వర’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్ర చారి మాట్లాడుతూ ఇదొక ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషనల్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో మంచి డివోషనల్ టచ్ కూడ వుంటుంది . ఈ చిత్రంలో శివుని నేపథ్యంలో ఉండే సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. జరార్డ్ ఫిలిక్స్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే సీనియర్ నటులు ఎంతోమంది ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ హం గులతో ఫిబ్రవరి నెల ఆఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

సురేష్ రవి, ఆశ వెంకటేష్, నిలగల్ రవి, బోసే వెంకట్, అడుకులం మురుగదాస్ గజరాజ్, జె ఎస్ కే గోపి, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జెరాడ్ ఫిలిక్స్, డిఓపి: ఆర్వి సీయోన్ ముత్తు, సింగర్స్: సాయి చరణ్, లిరిక్స్: వెంకట్, జ్యోతి, డిటిఎస్: శ్యామ్, ఎడిటర్: నందమూరి హరి, పిఆర్వో: బి. వీరబాబు, కో ప్రొడ్యూసర్ పి.సరిత , వి. బాలకృష్ణ,ప్రొడ్యూసర్: డాక్టర్ రవీంద్ర చారి, డైరెక్టర్: జీవి పెరుమాళ్ వర్ధన్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

9 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

9 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

10 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago