ఘనంగా సినీ ప్రముఖుల సమక్షంలో “పోలీస్ వారి హెచ్చరిక” ట్రైలర్ లాంచ్

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన “పోలీస్ వారి హెచ్చరిక” ట్రైలర్ ను ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు.

ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. మనమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జి మీద ఉన్న గౌరవం. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఆర్మీ నుండి వచ్చిన నిర్మాత జనార్ధన్ గారితో కలిసి క్రమశిక్షణతో ఈ సినిమాను చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటి ఇంద్రజ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. నేను ఈ ఈవెంట్ కు బాబ్జి గారి కోసం ఈ కార్యక్రమానికి వచ్చాను. నా ప్రతి పుట్టిన రోజుకు నన్ను విష్ చేసే సుధాకర్ గారికి ధన్యవాదాలు. జనార్ధన్ గారికి ఈ సినిమాతో మంచి విజయం రావాలి అని కోరుకుంటున్నాను. సినిమా విజయం సాధించేందుకు మీడియా వారు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ… “ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. సాధారణంగా చిన్ననాటి నుండి మనల్ని పెద్దవారు ఏదో ఒక విషయంలో హెచ్చరిస్తూ ఉంటారు. దానిని మనం మంచికి తీసుకుని ముందుకు వెళ్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పోలీసు వారు ఏదైనా హెచ్చరించినప్పుడు దానిని పాటిస్తే అది మనకే మంచిది. ఈ సినిమాలో అన్ని కోణాలు ఉన్నాయి. ఈ సినిమాకు అందరి ఆశీస్సులు ఉండాలి. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ… “ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఒక ఆదరణ లభిస్తుందని కోరుకుంటున్నాను. సినిమాలో చాలా మంచి ఆర్టిస్టులు నటించారు. మంచి కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బాబ్జి. జులై 18వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ… “పోలీస్ వారి హెచ్చరిక చిత్ర టైలర్ లంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ నా నమస్కారం. నేను జీవితంలో ముగ్గురు నమ్ముకున్నాను. తల్లిదండ్రులను, భారతదేశాన్ని అలాగే ఇప్పుడు కళామతల్లిని. నేడు నన్ను కళామతల్లి నిలబెడుతుంది అని నమ్ముతున్నాను. జూలై 18వ తేదీన సినిమాలు అందరూ చూసి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం. సినిమాల కోసం పనిచేసేవారు తాము చేసిన సినిమా విడుదలైన ప్రతిసారి పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తాము. జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

తారాగణం :
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా ఖుషి తదితరులు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు : బాబ్జీ
నిర్మాత : బెల్లి జనార్థన్
బ్యానర్ : తూలికా తనిష్క్ క్రియేషన్స్
సంగీతం : గజ్వేల్ వేణు
కెమెరా : కిషన్ సాగర్, నళినీ కాంత్
ఎడిటర్ : శివ శర్వాణి
సహ నిర్మాత : NP సుబ్బా రాయుడు
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

Tfja Team

Recent Posts

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

11 hours ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

13 hours ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

13 hours ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

13 hours ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

13 hours ago

‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్

శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…

13 hours ago