NATS 2025 ద్వారా తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

టంపాలో జరిగిన NATS 2025 వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఆయన రాకతో అదొక చరిత్రలా మారిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఖండాలు, భాషలు, సంస్కృతులలో, సరి హద్దుల్ని దాటుతూ ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ప్రజలకు అల్లు అర్జున్ కేవలం ఒక స్టార్ కాదు.. ప్రతీ కుటుంబంలోని ఓ వ్యక్తి.. తెలుగు వారి గుర్తింపు.. తెలుగు వారి గర్వం.

NATS 2025 కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇదొక ఎమోషనల్ ఈవెంట్‌గా సాగింది. తెలుగు వారి ప్రైడ్‌గా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులకు మించి విస్తరించి ఉన్న తెలుగు సమాజాన్ని ఎలా ఏకం చేసిందో టంపా చూసింది. ఇది ప్రపంచ వేదికపై తెలుగు వారికి గర్వకారణం.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన, ప్రేమించబడే, అనుసరించే తెలుగు నటుడు అల్లు అర్జున్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన విజయానికి చిహ్నంగా, తెలుగు గుర్తింపునకు ఒక వెలుగుగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు గర్వానికి నిజమైన చిరునామాగా మారారు.

విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాలకు NATSలో అల్లు అర్జున్‌ను చూడటం అంటే ఒక నటుడిని కలవడం కాదు. వారి మూలాలు, వారి భాష, వారి సంస్కృతితో తిరిగి కనెక్ట్ అవ్వడంతో సమానం. జీవితం వారిని ఎక్కడికి తీసుకెళ్లినా తమ హృదయాలలో తెలుగు స్ఫూర్తిని కలిగి ఉంటారని గుర్తుచేసిన క్షణం ఇది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago