పెదకాపు-1 ఫస్ట్ సింగిల్ ‘చనువుగా చూసిన’ ప్రోమో విడుదల  

Must Read

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆస్థాన విద్వాంసుడు మిక్కీ జె మేయర్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలకు ఈ మెలోడీ స్పెషలిస్ట్ సంగీతం అందించారు. సెన్సేషనల్  బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న న్యూ ఏజ్ ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెదకాపు-1’ కోసం వీరిద్దరూ జతకట్టారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ప్రధాన తారాగణం.

‘చనువుగా చూసిన’ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసిన మేకర్స్ మ్యూజికల్ జర్నీని ఆరంభించారు. మిక్కీ జె మేయర్ ప్లజంట్  మెలోడీని కంపోజ్ చేసారు. ప్రోమో అందరినీ అలరిస్తుంది. ఆర్కెస్ట్రేషన్, వాయిస్, లిరిక్స్ రొమాంటిక్ నంబర్‌కు తగ్గట్టుగా వున్నాయి. విరాట్ కర్ణ , ప్రగతి శ్రీవాస్తవ ఈ పాటలో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. విరాట్ కర్ణ రస్టిక్ గెటప్‌లో కూల్‌గా కనిపించగా, ప్రగతి శ్రీవాస్తవ్ సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. పూర్తి పాటను జూలై 27న విడుదల చేయనున్నారు.

Chanuvuga Chusina Song Promo | Peddha Kapu | Virat Karrna Pragati Srivasthava | Srikanth Addala

అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. టీజర్‌లో శ్రీకాంత్ అడ్డాల కథ-కథనంలో తన ప్రతిభను చూపించారు. టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.

ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ దర్శకుడు పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షించగా రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా  పని చేస్తున్నారు.

నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగ బాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి
సంగీతం – మిక్కీ జె మేయర్
డీవోపీ – చోటా కె నాయుడు
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
కొరియోగ్రాఫర్ – రాజు సుందరం
ఆర్ట్- జిఎం శేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News