పెదకాపు-1 థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 11న విడుదల

Must Read

విరాట్ కర్ణ, శ్రీకాంత్ అడ్డాల, మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ పెదకాపు-1 థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 11న విడుదల

యంగ్ ట్యాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదల తేదీ సమీపిస్తోంది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉండటంతో మ్యూజిక్ ప్రమోషన్‌లు చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమైయ్యాయి, టీజర్ మంచి అంచనాలను నెలకొల్పింది. ఇప్పుడు, మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్ డేడ్ కి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. ట్రైలర్ సెప్టెంబర్ 11న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ వీడియోలో  సినిమాలోని కోర్ పాయింట్‌ను తెలియజేసేలా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ వీడియోను విడుదల చేశారు.

పెద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా అని టీజర్ ద్వారా తెలుస్తోంది. ట్రైలర్‌లో సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియనున్నాయి.

ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ఇండియన్ లీడింగ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్.

నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి
సంగీతం – మిక్కీ జె మేయర్
డీవోపీ – చోటా కె నాయుడు
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
కొరియోగ్రాఫర్ – రాజు సుందరం
ఆర్ట్- జిఎం శేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News