టైటిల్ తోనే అందరినీ ఆకర్షిస్తోన్న సెటెరికల్ ఫన్నీ ఎంటర్టైనర్ ‘పైలం పిలగా’. వ్యవసాయం చేస్తే కడుపు నిండుతుంది కానీ కోట్లు కూడబెట్టలేమని బలంగా నమ్మిన ఓ యువకుడికి అనుకోకుండా సొంతూళ్లోనే కోట్ల రూపాయల బిజినెస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కానీ పద్మవ్యూహంలాంటి మన బ్యూరోక్రసీ వలలో చిక్కుకొని ఎలాంటి అవస్థలు పడ్డాడు? చివరకు ఏం చేసాడు? తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ హాస్యభరిత వ్యంగ చిత్రం ‘పైలం పిలగా. “పిల్లా పిలగాడు” వెబ్ సిరీస్ ఫేమ్ సాయి తేజ కల్వకోట, పుష్పా సినిమా ఫేమ్ పావని కరణం జంటగా నటించారు.
నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, వంటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్రనటులతో సహా వందకి పైగా యాడ్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించిన ఆనంద్ గుర్రం దర్శకత్వం లో వస్తోన్న మొదటి చిత్రం ‘పైలం పిలగా’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని ‘సోడు సోడు నొక్కమే నీ సోకు’ అనే పాటను డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు రిలీజ్ చేశారు.
ఎన్నో సెన్సషనల్ సాంగ్స్ అందించిన యశ్వంత్ నాగ్, రామ్ మిర్యాల, ఆనంద్ గుర్రం కాంబినేషన్ లో వస్తోన్న ఈ పాట గురించి డెరైక్టర్ శేఖర్ కమ్ముల గారు మాట్లాడుతూ మంచి సాహిత్యానికి మంచి ట్యూన్, మంచి ట్యూన్ కి మంచి సాహిత్యం తోడైతే ఆ పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. అలాంటి మంచి పాటల్లో ఈ సోడు సోడు పాట కచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాను, పాట తో పాటు సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుకుంటున్నా అని అన్నారు.
ప్రొడ్యూసర్ రామకృష్ణ బొదుల మాట్లాడుతూ చిన్న సినిమాలు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, ఫీల్ గుడ్ సినిమాలు కూడా పెద్ద సక్సెస్ అవుతాయని నిరూపించిన డెరైక్టర్ శేఖర్ కమ్ముల గారు. వారిని చూసి ఇన్స్పైర్ అయి ఎంతో మంది కొత్త ప్రొడ్యూసర్స్ విజయాన్ని అందుకున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ వచ్చిన మమ్మల్ని ప్రోత్సహిస్తున్న శేఖర్ కమ్ముల గారికి మా మొత్తం ‘పైలం పిలగా’ టీం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణబొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం లో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు.
కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ కూర్మనా, సె సెలిన్హారిక కపొట్ట లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణమసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…