పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ పూర్తి

Must Read

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ మచ్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ పూర్తి

ఉస్తాద్‌ రామ్‌ పోతినేని, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగస్ట్‌ 15న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

మేకర్స్ మాస్ సాంగ్ అఫ్ ది ఇయర్ స్టెప్పా మార్ తో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. ఇది ఆడియో ప్రమోషన్‌లకు చార్ట్‌బస్టర్ స్టార్ట్, మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందజేయడం ద్వారా పబ్లీసిటీ దూకుడు పెంచారు.

‘డబుల్ ఇస్మార్ట్’ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌, మచ్ ఎవైటెడ్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.

సామ్ కె నాయుడు, జియాని గియాన్నెలి సినిమాటోగ్రఫర్స్ కాగా, మణి శర్మ మ్యూజిక్ అందించారు.

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సిఈవో: విష్
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Latest News

Hakku initiative Mana Hakku Hyderabad curtain raiser song launched

Hakku Initiative, a social awareness campaign in partnership with the public and the government, launched the 'Hyderabad Curtain Raiser'...

More News