టాలీవుడ్

సాయి ధరమ్‌ తేజ్‌ చేతుల మీదుగాపవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గౌ. శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారి పుట్టిన రోజు సందర్భంగా ‘మార్క్‌ మీడియా’ నుండి ‘ఆస్థి మేలుకొలుపు’ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్ష కాపీల పంపిణీకి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఈ సంచికను రామోజీ ఫిలింసిటీలో గురువారం సాయంత్రం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌ కళ్యాణ్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ..

పవన్‌ కళ్యాణ్‌ గారిపై ప్రచురించిన ఈ ప్రత్యేక సంచికను అభిమానులందరూ తప్పకుండా చదవాలని కోరారు. ఈ ప్రత్యేక సంచికలో పవన్‌ కళ్యాణ్‌ గారి ఉద్ధేశాలు, రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పడినటువంటి శ్రమ, భవిష్యత్తు తరాల అభివృద్ధి పట్ల ఆయన వ్యూహాలు తదితర అంశాలతో సుమారు 25 మంది సీనియర్‌ జర్నలిస్టులు రాసిన ఆర్టికల్స్‌తో రూపొందుతున్న ఈ పత్రికను ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన కోరారు.


ఈ సందర్భంగా సీనియర్‌ ఫిలిం జర్నలిస్ట్‌ శ్రీ ప్రభుగారు మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీపై ఎడిటర్‌ అండ్‌ పబ్లిషర్‌ పెచ్చెట్టి మురళీరామకృష్ణా రెడ్డి ప్రత్యేక అభిమానంతో రూపొందించిన ఈ పత్రికను ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు.


ఈ సందర్భంగా ఎడిటర్‌ అండ్‌ పబ్లిషర్‌ పెచ్చెట్టి మురళీరామకృష్ణా రెడ్డిగారు మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌గారిపై ఉన్న ప్రేమ, అభిమానంతో ఈ పత్రికను మీ ముందుకు తీసురావడం జరిగిందని, యువత ఆయన గురించి మరింత తెలుసుకొని అనుసరించాల్సి విషయాలు ఎన్నో ఉన్నాయని, భవిష్యత్‌ తరాలపట్ల ఆయన పడుతున్న తపన చేస్తున్నటువంటి వ్యూహరచన తెలుసుకొని అనుసరించాలని, ఆయనలా ఆలోచించే నాయకులు బహు అదురు అని, ఆయనకు ప్రతి ఒక్కరూ తమ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.


ఎంతో మంది శ్రమకోర్చి రూపొందిన ఈ పత్రికలో తను భాగస్వామిని అవుతానని పవన్‌ కళ్యాణ్‌ అభిమాని వీడియో గ్రాఫర్‌ చంద్ర తక్షణ స్పందనతో రూ. 20 వేలు విరాళం ప్రకటించారు. హీరో సాయి ధరమ్‌ తేజ్‌ అయనను ప్రత్యేకంగా అభిమానించారు.
ఈ కార్యక్రమంలో హీరో సాయి ధరమ్‌ తేజ్‌, మార్క్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత పెచ్చెట్టి మురళీరామకృష్ణా రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌లు ప్రభు, సముద్రాల సురేంద్రరావు, పరిటాల రాంబాబు, మధు, రాయుడు గణపతి, ఫిలిం డైరెక్టర్‌ ప్రకాష్‌ పులిజాల మరియు ఇతరులు పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించలీ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

చిత్రపరిశ్రమలో,ఇటి రంగంలో,బ్యాంకింగ్ రంగంలో, మారుతున్న సమాజం దుష్ట లై0గిక వేధింపులు ఎక్కువగా అవ్వుతున్నయి ,కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చుచున్నారు…

3 mins ago

MAD gang with MAD MAXX Entertainment with First Look

Sithara Entertainments, the leading production house of Telugu Cinema, has delivered a huge blockbuster with…

17 mins ago

‘మ్యాడ్’కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ఫస్ట్ లుక్

'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ లుక్ తో 'మ్యాడ్' గ్యాంగ్ పునరాగమనాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్…

17 mins ago

పాన్ ఇండియా ఫిల్మ్ ‘సుబ్రహ్మణ్య’- బియాండ్ ఇమాజినేషన్ గ్లింప్స్ రిలీజ్

పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన దర్శకత్వంలో "సుబ్రహ్మణ్య"సినిమాతో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఎస్‌జి…

2 days ago

Subrahmanyaa’s Glimpse The First Adventure is beyond imagination

The pre-look of Subrahmanyaa was recently launched and has widely been appreciated by the netizens…

2 days ago

‘గొర్రె పురాణం’ ట్రైలర్ రిలీజ్- సెప్టెంబర్ 20 రిలీజ్

రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం హ్యాట్రిక్ విజయాల తర్వాత హీరో సుహాస్ నుంచి వస్తున్న యూనిక్…

2 days ago