విశ్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ : టీజీ విశ్వప్రసాద్ 

Must Read

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.

గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాకి టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. చాలా రిస్కీ ప్లేసెస్ లో ఈ సినిమాని షూట్ చేశాం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈరోజు సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటే వాళ్ళ హార్డ్ వర్క్ కే కారణం. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ సౌండింగ్ చాలా కొత్తగా ఉంది. ఎక్స్ ట్రార్డినరీ సాంగ్స్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీసాడు. తను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. గుహన్ గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలని అనుకున్నాం. ఈ సినిమాతో కుదిరింది. లొకేషన్స్, యాక్టర్స్ ని చాలా అందంగా చూపిస్తారు. ఎక్స్ ట్రార్డినరీ అవుట్ పుట్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ ఇద్దరికీ థాంక్స్ చెప్తున్నాను. విశ్వప్రసాద్ గారు ఈ సినిమాకి రావడం చాలా ప్లస్ అయింది. గోపి మోహన్ తో పాటు ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్ కి థాంక్యూ. గోపి మోహన్ గారు లక్ష్యం, లౌక్యం సినిమాలకి పని చేశారు. విశ్వం కూడా సేమ్ రేంజ్ ఆఫ్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి సారీ చెప్పాలి( నవ్వుతూ) ఎందుకంటే యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ చూస్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చేసింది. సీన్స్ అంత బాగా వచ్చినాయి. ప్రతి సీన్ చేసేటప్పుడు సెట్ లో నవ్వుకుంటూనే ఉన్నాం. సినిమాల్లో పని చేసిన ఆర్టిస్టులు అందరికీ థాంక్యూ. డైరెక్టర్ శ్రీను గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫంక్షన్ లో కలిసాం. అప్పటినుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆయన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. తన సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారో అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఆయన స్క్రిప్ట్ మీద దాదాపు 7 నెలలు పని చేశారు. ఆయన సీన్ చెప్పినప్పుడే చాలా అద్భుతంగా పెర్ఫాం చేస్తారు. ఆయన మార్క్ ప్రతి ఆర్టిస్ట్ లో కనిపిస్తుంది. ఆయన టైమింగ్ చాలా యూనిట్ గా ఉంటుంది. ఆయనతో జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. ఒక బ్రదర్ గా ఫీల్ అయ్యాను. ఆయన ఎక్స్ ట్రార్డినరీ పర్సన్. ఆర్టిస్ట్ ని కంఫర్ట్ జోన్ లోకి తీసుకువచ్చి తనకు కావాల్సింది తీసుకుంటారు. నేను చాలా సినిమాలు చేశాను. ఇంత కంఫర్ట్ ఎక్కడ ఫీల్ అవ్వలేదు. శ్రీను గారు చాలా యూనిక్ పర్సన్. కంటిన్యూస్ గా సినిమా మీదే వర్క్ చేస్తుంటారు. వేరే డైవర్షన్ ఉండదు. అక్టోబర్ 11న దసరాకి సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ నవ్వు ఆగదు. యాక్షన్, కామెడీ, ఫన్ ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక మాట చెప్పగలను. శ్రీనువైట్ల గారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్. థాంక్ యూ సో మచ్’ అన్నారు 

డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విశ్వం నిజంగా బ్యూటిఫుల్ జర్నీ. ఈ బ్యూటిఫుల్ జర్నీలో నా బెస్ట్ కో ప్యాసింజర్ గోపీచంద్ గారు. మా ఇద్దరితో ఈ జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత వేణు గారు వచ్చారు. తర్వాత విశ్వ ప్రసాద్ గారు వచ్చారు. ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేశాను. గోపి మోహన్, భాను, నందు, ప్రవీణ్ వర్మ ఈ నలుగురు నేను అనుకున్న కథని అనుకున్నట్లు రావడానికి చాలా కష్టపడి పని చేశారు. ఈ సినిమాలో టెక్నీషియన్స్ అంతా నా మీద ఇష్టంతో ప్రేమతో పని చేశారు. ఈ సినిమాని నేను అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగాను. ఐ యాం 100% కాన్ఫిడెంట్ ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. రెండున్నర గంటలో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. ఎంగేజింగ్ గా హిలేరియస్ గా వుంటుంది. చేతన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రీ రికార్డింగ్ చేయడం చాలా కష్టం. తను ఎఫర్ట్ లెస్ గా చాలా బాగా చేశాడు. ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్నది అనుకున్నట్లుగా తీయడానికి సపోర్ట్ చేసిన విశ్వ ప్రసాద్ గారికి వేణుగారికి థాంక్స్ చెప్తున్నాను. గుహన్ నాకు ఒక యంగర్ బ్రదర్ లా ఉంటూ చాలా సపోర్ట్ చేశారు. ఎడిటర్ అమర్ ఈ సినిమా హిట్ కావాలని అనుక్షణం పనిచేసాడు. కావ్య పర్ఫామెన్స్ తో పాటు డాన్సులు కూడా చాలా ఎనర్జిటిక్ గా చేసింది. అనీషా, ప్రగతి గారు, నరేష్ గారు, సునీల్, వెన్నెల, కిషోర్, శ్రీనివాస్ రె,డ్డి శ్రీకాంత్ అయ్యంగర్, రాహుల్ రామకృష్ణ.. యాక్టర్స్ అందరు కూడా ఎంతో ఇష్టపడి చాలా ప్రేమతో పనిచేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఏ సినిమా అయినా డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్లు తీయాలంటే హీరో సపోర్టు ఉండాలి. గోపి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చాడు.ఆయన వల్లే నేను అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను. డెఫినెట్ గా ఈ సినిమా నాకు గోపికి చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ హిట్ తో దసరాని చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. అందరికీ హ్యాపీ దసరా. థాంక్యూ సో మచ్’ అన్నారు

ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేను యూఎస్ లో ఉన్నప్పుడు శీను వైట్ల గారి సినిమాలు స్ట్రెస్ బస్టర్స్. ఆయనతో కలిసి అసోసియేట్ అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. గోపీచంద్ గారితో ఇది మా సెకండ్ మూవీ. ఇలాంటి మూవీస్ చాలా చేయాలని కోరుకుంటున్నాం అక్టోబర్ 11న అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ’ అన్నారు. 

హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ… విశ్వం నాకు చాలా స్పెషల్ మూవీ. శ్రీను వైట్ల గారి హీరోయిన్ అనే ట్యాగ్ నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఆయన సపోర్ట్ కి చాలా థాంక్యూ. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్టర్ గా మెరుగయ్యాను. గోపి సార్ తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయనతో డాన్స్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. వేణు గారు సపోర్ట్ కి థాంక్యూ. విశ్వంకు ఆయన మెయిన్ పిల్లర్. ఫారెన్ షెడ్యూల్స్ అన్ని ఆయన సపోర్ట్ తోనే చాలా సాఫీగా జరిగాయి. గుహన్ గారు ఐ ఫీస్ట్ లాంటి విజువల్స్ ఇచ్చారు. సినిమాని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేసిన నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి థాంక్యూ. ఆయన లేకపోతే ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హోం ఫర్ మీ. టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. విశ్వం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆడియన్స్ కి నవరాత్రి ట్రీట్ లాంటి సినిమా. తప్పకుండా అక్టోబర్ 11న సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు. 

రైటర్ బివిఎస్ రవి మాట్లాడుతూ.. నన్ను డైరెక్టర్ ని చేసిన హీరో గోపీచంద్ గారు. నన్ను రైటర్ గా నిలబెట్టిన దర్శకుడు శ్రీనువైట్ల గారు. వీళ్ళిద్దరూ నాకు ఎంతో ప్రత్యేకం. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. శ్రీను వైట్ల గారి వైభవాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిని. మళ్లీ ఆ వైభవాన్ని అందుకోబోతున్నారు. అది ట్రైలర్ తోనే ప్రూవ్ అయింది. గోపీచంద్ గారు ఎంత మంచి మనిషో అంత గొప్ప స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న యాక్టర్. ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ వస్తుంది. ఈ దసరా వాళ్ళిద్దరికీ చాలా మెమొరబుల్ దసరా అవుతుంది. విశ్వప్రసాద్ గారు ఎంతో పాషన్ తోసినిమాలు తీస్తున్నారు. ఆయనకి విజయం రావడం సినిమా ఫీల్డ్ కి అవసరం. అందువల్ల ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విశ్వం టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్’ అన్నారు 

ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా కుటుంబం 86 ఇయర్స్ నుంచి సినిమాల్లో ఇన్వాల్వ్ అయింది. నాకు ఇది ఫస్ట్ ఫిలిం. 1936 నుంచి వాళ్ళు ఎలా అయితే మంచి సినిమాలు చేశారో అలాంటి మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ జర్నీ స్టార్ట్ అయింది. శ్రీనువైట్ల గారిని తొలిసారి కలిసినప్పుడు మళ్ళీ ఆడియన్స్ ని నవ్వించాలి, హిట్ కొట్టాలి అనే పట్టుదలతో ఉన్నారు. ఈ సినిమా ఇచ్చిన శ్రీను వైట్ల గారికి థాంక్యూ. హీరో గోపీచంద్ గారికి థాంక్యూ వెరీ మచ్. గుహన్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. చైతన్ శ్రీనువైట్ల గారికి కావలసిన సాంగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోరు అద్భుతంగా ఇచ్చాడు. కావ్య థాపర్ చాలా అందంగా నటించింది. ఇటలీ, మతేరా ..ఇలా చాలా అద్భుతమైన ప్రదేశాల్లో యూనిట్ అంతా చాలా కష్టపడి షూట్ చేయడం జరిగింది. అందరూ చాలా డెడికేషన్ తో పని చేశారు. గోపీచంద్ గారు చాలా కమిట్మెంట్ తో ఈ సినిమా చేశారు ఆయన యాక్షన్ , ఎమోషనల్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేస్తారు. ఈ సినిమాలో ఫన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. అవుట్ ఫుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. శీను వైట్ల గారు చాలా క్లారిటీగా ఉన్న డైరెక్టర్. 81 డేస్ లో ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఇంత పెద్ద సినిమాని ఈ టైంలో చేయడం మామూలు విషయం కాదు. హ్యాట్సాఫ్ టు శ్రీనువైట్ల గారు. గోపీచంద్ గారి అభిమానులందరికీ థాంక్యూ. ఇది మా హీరో సినిమా అని అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది. అందరికీ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు’ తెలిపారు. 

అనీషా ఆంబ్రోస్ మాట్లాడుతూ.. ఇందులో మదర్స్ సాంగ్ ని మీరంతా చూసే ఉంటారు. ఆ సాంగ్ లో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచిన శ్రీనువైట్ల గారికి థాంక్యూ వెరీ మచ్. గుహన్ గారు బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. గోపి గారు చాలా హంబుల్ పర్సన్. ఆయనతో కలిసి ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది’ అన్నారు

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టెర్రిఫిక్ యాక్టర్ గోపీచంద్ గారు. ఆయన ఆన్ స్క్రీన్ పర్సోనా చాలా బాగుంటుంది. గోలీమార్ నా ఫేవరెట్ ఫిలిం. యాక్షన్ హ్యూమర్ ఎఫర్ట్ లెస్ గా చేస్తారు. శ్రీనువైట్ల గారు సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఇందులో ట్రైన్ ఎపిసోడ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కావ్య చాలా అందంగా కనిపిస్తోంది. గుహన్ గారి విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. విశ్వప్రసాద్ గారికి, వేణు గారికి ఆల్ ది బెస్ట్’అన్నారు.  

డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ.. నేను గోపి సార్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. శ్రీనువైట్ల గారు బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్. యూట్యూబ్లో సెర్చ్ చేసే సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి శ్రీనువైట్ల గారివే. ఆయన సినిమాలు ఫ్రెండ్స్ తో కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సినిమా టీమ్ అందరికీ గుడ్ లక్. ప్రొడ్యూసర్స్ విశ్వ ప్రసాద్ గారికి, వేణు గారికి ఆల్ ది బెస్ట్’అన్నారు. 

మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీనువైట్ల గారు నా వర్క్ ని ఇష్టపడటం లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. సాంగ్స్ టీజర్ ట్రైలర్ అన్నింటికీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఫన్, యాక్షన్ అన్నీ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ వేణు గారు, విశ్వప్రసాద్ గారికి థాంక్యు వెరీ మచ్. గోపీచంద్ గారు యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యూ. గుహన్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. సినిమా ఆడియన్స్ కి తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు. 

డిఓపి కెవి గుహన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మేమందరం కలిసి శ్రీను వైట్ల గారు గురించి పనిచేశాం. ఆయన తన సినిమాలతో ఎంతో ఆనందాన్ని పంచారు. జనరేషన్స్ ఆయన సినిమాలు గురించి మాట్లాడారు. ఈ సినిమాతో మోర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆడియన్స్ కి కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. గోపీచంద్ గారితో కలిసి పనిచేయడం చాలా మంచి ఆనందాన్ని ఇచ్చింది. అందరికీ థాంక్యు’ అన్నారు. సినిమా యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News