ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’..

హీరోయిన్ శ్రీలీల‌ను చూసి హీరో నితిన్ ‘డేంజర్ పిల్ల..’ అని అంటున్నారు మ‌రి. అస‌లు నితిన్‌ను అంతలా శ్రీలీల ఎందుకు భ‌య‌పెట్టిందనే విష‌యం తెలుసుకోవాలంటే ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. 

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్ క‌థానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. లైన్‌. రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణను పూర్తి చేసుకున్న  ఈ మూవీ డిసెంబ‌ర్ 23న వ‌రల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఆగ‌స్ట్ 2న ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల…’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను మేక‌ర్స్ సోమ‌వారం రోజున విడుద‌ల చేశారు. 

మ్యూజికల్ జీనియ‌స్ హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలోని ‘డేంజర్ పిల్ల..’ సాంగ్‌ను కృష్ణకాంత్ రాయ‌గా, అర్మాన్ మాలిక్ ఆల‌పించారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, క‌చ్చితంగా ఆయ‌న అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ త‌న బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నారు.  క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌కి రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ న‌వ్విస్తూనే స‌ర్‌ప్రైజ్‌ల‌తో సినిమా మెప్పించ‌నుంది’’ అని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు.

 శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై  సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

5 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

5 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

5 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

5 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

5 days ago