స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో రూపొందిన “ఫ్యామిలీ స్టార్” సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్, విజయ్ ఫ్యాన్స్ హాజరయ్యారు. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మూవీ టీమ్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో
గాయని మంగ్లి మాట్లాడుతూ – ఫ్యామిలీ స్టార్ సినిమాలో కల్యాణి వచ్చా వచ్చా లాంటి బ్యూటిఫుల్ సాంగ్ పాడే అవకాశం ఇచ్చిన గోపీ సుందర్ గారికి థ్యాంక్స్. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో యూత్ స్టార్ అయ్యారు. ఫ్యామిలీ స్టార్ తో ఫ్యామిలీ స్టార్ కావాలని కోరుకుంటున్నా. గీత గోవిందంతో వంద కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకున్నారు. అదే కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ 300 కోట్లు వసూళు చేసే బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ – ఫ్యామిలీ స్టార్ సినిమా మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ సినిమాను ఇష్టపడతారు. ఈ కథలోని ఎమోషన్స్ కు కనెక్ట్ అవుతారు. నేను, విజయ్ గీత గోవిందం సినిమా చేశాం. మళ్లీ మేము కలిసి సినిమా చేస్తున్నామంటే అది గుర్తుండిపోయే మూవీ కావాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేసేందుకే ప్రయత్నంచాను. విజయ్ ఈ కథ విన్నప్పుడు పడిన ఎగ్జైట్ మెంట్, ఇందులో తను చేసిన గోవర్థన్ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అయిన విధానం రేపు స్క్రీన్ మీద చూస్తారు. విజయ్ ఇప్పటిదాకా చేసిన పర్ ఫార్మెన్స్ లు ఒకెత్తు. ఈ సినిమా మరో ఎత్తు అనుకోవచ్చు. ఇందు క్యారెక్టర్ ను మృణాల్ అద్భుతంగా పోషించింది. తెలుగు డైలాగ్స్ నేర్చుకుంది. ఇందు, గోవర్థన్ క్యారెక్టర్స్ మీకు ఎంతో సహజంగా అనిపిస్తాయి. గోవర్థన్ అంటే మీరూ నేనూ మనలో ఒక వ్యక్తి. పరుగు సినిమాకు ఎస్వీసీ సంస్థలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. అప్పుడే రాజు గారి బ్యానర్ లో మూవీ చేయాలని కోరిక కలిగింది. ఈ సినిమాకు నేను రాసిన ప్రతి మాట నా గుండెల్లోనుంచి వచ్చిందే. బ్లడ్ అండ్ సోల్ పెట్టి ఈ సినిమాకు పనిచేశాను. నేనే కాదు టీమ్ అంతా అలాగే కష్టపడ్డారు. సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్, సంగీత దర్శకుడు గోపీ సుందర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ వాసు వర్మ..ఇలా ప్రతి ఒక్కరం టీమ్ వర్క్ గా మంచి సినిమా చేశాం. సక్సెస్ మీట్ లో మిమ్మల్ని త్వరలోనే కలుస్తాం. అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – మన ఫ్యామిలీస్ లోని ఎమోషన్స్ అన్నీ కలిపి తయారు చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. సకుటుంబంగా ప్రతి ఒక్కరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. పరశురామ్ విజయ్ క్యారెక్టర్ ను బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడు. అతను నవ్విస్తాడు, ఫైట్స్ చేస్తాడు, కోపం వస్తే కొట్టమని హీరోయిన్ తో దెబ్బలు తింటాడు. ఫ్యామిలీ స్టార్ చూశాక అమ్మాయిలకైతే విజయ్ క్యారెక్టర్ చాలా నచ్చుతుంది. నన్ను లక్కీ హ్యాండ్ అంటారు గానీ మృణాల్ లక్కీ హీరోయిన్. సీతా రామం, హాయ్ నాన్న తర్వాత ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ అందుకోబోతోంది. ఈ సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ ను ఎంజాయ్ చేయండి. మీరంతా ఎగ్జామ్స్ పాసయ్యి నెక్ట్ క్లాస్ లోకి వెళ్లడమే కాదు ఈ సినిమా చూశాక ఫ్యామిలీ స్టార్స్ అవుతారు. ఫ్యామిలీ స్టార్ లో మంచి మ్యూజిక్ ఇచ్చారు గోపీ సుందర్. కళ్యాణి వచ్చా వచ్చా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో చూశారు. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాబోతోంది. తెలుగు ప్రేక్షకుల్ని అలరించి పెద్ద సక్సెస్ అందుకుంటుంది. ఈ సినిమా కోసం 48 అవర్స్ రిలీజ్ కు ఉందనగా ఇప్పటికీ కష్టపడుతున్న నా టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ – ఇవాళ ఎంతో ప్రత్యేకమైన రోజు. చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతోంది. నన్ను మీరంతా తెలుగు అమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు. సీతా రామం, హాయ్ నాన్న, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో మీ ఆదరణ చూపిస్తున్నారు. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ గారికి థ్యాంక్స్. ఇందు క్యారెక్టర్ లో నటించడం మొదటి 15 రోజులు కష్టంగా అనిపించింది. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ ను నాకంటే ఎవరూ బాగా చేయలేరన్న సంతోషం కలిగింది. విజయ్ ను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. రోహిణి బామ్మతో కలిసి నటించడం ఎంతో ఎంజాయ్ చేశాను. ఊహా, శాన్వీ, కార్తిక్, లిఖిత్..ఈ పిల్లలతో సరదాగా షూటింగ్ చేశాం. దిల్ రాజు గారితో మరో సినిమా చేయాలనుకుంటున్నా. గోపీ సుందర్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. కల్యాణి వచ్చా వచ్చా సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాం. ఫ్యామిలీ స్టార్ సినిమాను మా ఫ్యామిలీ స్టార్ అయిన నాన్నకు అంకితమిస్తున్నా. ఆయన ఇవాళ ఇక్కడికి రావడం హ్యాపీగా ఉంది. ఏప్రిల్ 5న మీరంతా మీ ఫ్యామిలీస్ తో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాకు వెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – తెలుగు ఆడియెన్స్ అందరికీ, నా ఫ్యాన్స్ కు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ, లవ్ యూ. ఆరేళ్ల కిందట నా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గీత గోవిందం ఇదే డైరెక్టర్ తో చేశాను. ఆ రోజులు వేరు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి వరుసగా సూపర్ హిట్స్ ఇస్తున్నాడని నా గురించి మాట్లాడుకున్నారు. నా మొదటి సినిమా పెళ్లి చూపులు టైమ్ లో మీ గురించి మీరు వినాలని అనుకుంటున్న పెద్ద గాసిప్ ఏంటని అడిగితే నా సినిమా వంద కోట్ల రూపాయలు వసూళు చేసినట్లు న్యూస్ చూడాలి అన్నాను. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అప్పటికి. ఆ డ్రీమ్ నా నాలుగో సినిమాకే నిజమైంది. గీత గోవిందం వంద కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. వంద కోట్ల రూపాయల వసూళ్ల సినిమా అందుకోవాలి అని చెప్పిన కుర్రాడు..తన మరో సినిమా రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తుందని చెప్పాడు. కానీ అందుకోలేకపోయాడు. అలా ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చావు అని నాతో చాలా మంది అన్నారు. నీ వయసు హీరో అలా మాట్లాడితే అహంకారం అనుకుంటారు అని ప్రేమతో నాకు చెప్పిన పెద్దవాళ్లున్నారు. రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ సినిమా చేస్తానని చెప్పడం తప్పు కాదు. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా…రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తా. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే. కానీ ఇది నా మీద నాకున్న నమ్మకం, విశ్వాసం. నేను ఉదయం లేచినప్పడు, షూటింగ్ కు వెళ్లినప్పుడు, ఈ వేదిక మీద మాట్లాడేప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో ఉంటా. ఇంకొకరు స్టార్ కాగా లేనిది మనం కాలేమా, మీరు కాలేరా, ఇంకొకరు రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ కొట్టగా లేంది నేను ఆ ఫీట్ సాధించలేనా. పెళ్లి చూపులు నుంచి ఫ్యామిలీ స్టార్ దాకా నేను చేసిన ప్రతి సినిమా ఏదో కొత్త విషయాన్ని నేర్పించింది. ఇదొక జర్నీ. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు ఎదురవుతుంటాయి. అవన్నీ దాటుకుని మనం అనుకున్నది సాధించాలి. మనకు మన గోల్ మాత్రమే కనిపించాలి. నేను అలాగే అనుకుంటా. అదే నమ్మకంతో పనిచేస్తుంటా. మీలో చాలా మంది యాక్టర్స్, బిజినెస్ మెన్, డైరెక్టర్స్, కంటెంట్ క్రియేటర్స్ ..ఇలా ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు. ఆ కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నించండి. నేను నా మొదటి సినిమా ప్రీ రిలీజ్ లోనే చెప్పాను. తలెత్తుకోండి, హ్యాపీగా ఉండండి. నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్. పరశురామ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకువచ్చాడు. మాకు కష్టాలు తెలియకుండా కష్టపడ్డారు నాన్న. ఆయన మా ఫ్యామిలీ స్టార్. యూకే వెళ్లి మా అందరికీ సపోర్ట్ గా నిలిచిన మామయ్య, తమ్ముడిని యూఎస్ పంపేందుకు హెల్ప్ చేసిన మా దుబాయ్ అన్నయ్య, పెద్దమ్మ..ఇలా ఫ్యామిలీలోని చాలా మంది గుర్తుకువచ్చి ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. ప్రతి ఫ్యామిలీలో స్టార్ ఉంటాడు. ఆ స్టార్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమా నాకు దక్కడం, ఆ సినిమాను మీ ముందుకు నా ద్వారా తీసుకురావడం ఒక బ్లెస్సింగ్ లా భావిస్తున్నా. ఈ సినిమాలో నా పర్ ఫార్మెన్స్ నెక్ట్ లెవెల్ అని డైరెక్టర్ చెప్పారు. కానీ నేను చేసిన పర్ ఫార్మెన్స్ కు మొత్తం క్రెడిట్ పరశురామ్ కే ఇవ్వాలి. ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీకి హెడ్ మా దిల్ రాజు గారు. ఆయన ఈ సినిమా కోసం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్, రిలీజ్ వర్క్స్ తో పాటు ప్రమోషన్ లో మాతో అలుపులేకుండా తిరుగుతున్నారు. మాతో డ్యాన్సులు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురామ్ గారు. ఆయన లేకుంటే ఈ సినిమానే లేదు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా పరశురామ్ దే. ఈ సమ్మర్ కు మా టీమ్ నుంచి మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ ఫ్యామిలీ స్టార్. మీ ఫ్యామిలీస్ తో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ రోజు…
Renowned producer Allu Aravind visited actor Sri Tej, who is currently receiving treatment at KIMS…
Dharma and Aishwarya Sharma are playing the lead roles in the movie Drinker Sai, with…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…
The first trailer for Karate Kid: Legends has dropped, featuring the return of Jackie Chan…
VB Entertainments 's Boppana Vishnu presented the Bulli Tera Awards 2023-2024 .On this occasion, a…