రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ఆపరేషన్ రావణ్” నిన్న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. “ఆపరేషన్ రావణ్” చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందించారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించింది. నిన్న (శుక్రవారం) గ్రాండ్ రిలీజ్ అయిన “ఆపరేషన్ రావణ్” సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని మూవీ టీమ్ చెబుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
దర్శకుడు వెంకట సత్య మాట్లాడుతూ – మా “ఆపరేషన్ రావణ్” సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మల్టీఫ్లెక్స్ ల్లో నిన్న మ్యాట్నీ షోస్ నుంచి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఏపీలోని వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లో మా మూవీకి ఆదరణ దక్కుతోంది. “ఆపరేషన్ రావణ్” సినిమాకు మీడియా నుంచి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. మా కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలో మారుతి గారు లాంటి వాళ్లంతా సినిమా బాగుందని చెప్పారు. రివ్యూస్ ఎంకరేజింగ్ గా ఇచ్చారు. నిన్న రక్షిత్ మిగతా టీమ్ హైదరాబాద్ లోని థియేటర్స్ విజిట్ చేశారు. రేపు వైజాగ్, విజయవాడ థియేటర్స్ విజిట్ చేస్తున్నాం. మా సినిమాకు ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. పలాస 2 సినిమా కూడా మా రక్షిత్ హీరోగా రూపొందిస్తాం. త్వరలో ఆ సినిమా వివరాలు వెల్లడిస్తాం. అన్నారు.
హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ – మా “ఆపరేషన్ రావణ్” సినిమాకు మీరంతా ఇస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్. సినిమా బాగుందనే టాక్ నిన్న మార్నింగ్ షోస్ నుంచే మొదలైంది. “ఆపరేషన్ రావణ్” కు అన్ని చోట్ల నుంచీ మంచి ఆదరణ దక్కుతోంది. నేను ఇప్పటిదాకా రూరల్ క్యారెక్టర్స్ లో కనిపించాను. ఈ సినిమాలో అర్బన్ లుక్ లో బాగున్నాననే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. నేను గతంలో చేసిన సినిమాలతో చూస్తే ఇందులో కొత్తగా ఉన్నానని చెబుతుండటం హ్యాపీగా ఉంది. మా కష్టానికి తగిన ఫలితంగా ప్రేక్షకులు విజయాన్ని అందించారు. మా మూవీలో సైకో ఎవరన్నది ఇంటర్వెల్ లోగా గెస్ చేస్తే సిల్వర్ కాయిన్ ఇస్తామని చెప్పాం. మీడియా నుంచి ఇద్దరు లేడీ రిపోర్టర్స్ కరెక్ట్ గా గెస్ చేశారు. వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. అన్నారు.
డైలాగ్ రైటర్ లక్ష్మీ లోహిత్ పూజారి మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమాలో డైలాగ్ రైటర్ గానే కాదు ఓ మంచి క్యారెక్టర్ లో కూడా మీకు పరిచయం అయ్యాను. ఈ సినిమాను మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు
సాంకేతిక బృందం
సంగీతం: శరవణ వాసుదేవన్
డైలాగ్స్: లక్ష్మీ లోహిత్ పూజారి
ఎడిటర్: సత్య గిద్దుటూరి
ఆర్ట్: నాని.టి
ఫైట్స్: స్టంట్ జాషువా
కోరియోగ్రఫీ: జేడీ
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి
పిఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
రచన-దర్శకత్వం: వెంకట సత్య
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…
అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…