మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాపై మరింత హైప్ పెంచింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 7వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
రవితేజ మార్క్ ఎనర్జీకి, కిశోర్ తిరుమల క్లాస్ టచ్ తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. సంక్రాంతి బరిలో వస్తున్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. ముఖ్యంగా రవితేజ ఇద్దరు భామల (ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి) మధ్య నలిగిపోయే ‘లవ్ ట్రయాంగిల్’ సన్నివేశాలు నవ్వులు పూయించాయి. జనవరి 7న రాబోయే ట్రైలర్‌లో కథలోని అసలు ట్విస్టులేంటో, రవితేజ పండించే కామెడీ ఏ రేంజ్‌లో ఉండబోతోందో పూర్తి క్లారిటీ రానుంది.
భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా ‘వామ్మో వాయ్యో’ అనే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. రవితేజ మేనరిజమ్స్, స్టెప్పులు ఈ పాటను ఇన్స్టంట్ హిట్‌గా మార్చేశాయి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం భోగి పండుగ కానుకగా జనవరి 13న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు మరింత గ్రాండ్‌నెస్‌ను జోడించాయి. “ఇది కేవలం మాస్ సినిమా మాత్రమే కాదు, ప్రతి ఫ్యామిలీ ఎంజాయ్ చేసే క్లీన్ ఎంటర్టైనర్” అని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్ తదితరులు
సాంకేతిక సిబ్బంది
బ్యానర్: SLV సినిమాస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచయిత, దర్శకుడు: కిషోర్ తిరుమల
DOP: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
PRO: వంశీ-శేఖర్
నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందనున్న యూనిక్ సైఫై ఎంటర్‌టైనర్.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో…
తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో బహు భాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ దుల్కర్ సల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…