‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చాలా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుంది. ఆలోచింపచేస్తూనే ఆనందాన్ని ఇస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో త్రిగుణ్



త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా  ప్రధాన పాత్రల్లో చేస్తున్న హైలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. అరుణ్ చిలువేరు,  ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టీజర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసిన అతిధులు అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి .అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూడడం థియేటర్ కి  రావడం చాలా ఆనందంగా ఉంది. బాబ్జి గారికి థాంక్యూ తక్కువ టికెట్ ధరల్లో పెడితే ఆడియన్స్ అందరూ వచ్చి చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం. మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.  

డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. నేను ఈ ఇండస్ట్రీలో ఉండడానికి కారణం చంటి గారు. ఆయన లేకపోతే ఈ జర్నీ ఇంత స్మూత్ గా జరిగేది కాదు. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చినప్పుడు విన్న ఒక మాట నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. వ్యవసాయ భూమి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందంటే.. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలి.. ఈ ఆలోచనతో చేసిన కథ. ఇది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ హత్తుకునేలా వుంటుంది.  హీరో త్రిగుణ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది మాది. 5 ఏళ్ల జర్నీ.  మొదటి రోజు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాము. బాబ్జి గారు చాలా మంచి మనిషి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు మీ మొహం లో చిరునవ్వు ఎక్కడికి పోదు. ఈ సినిమా ఆనందంపజేస్తుంది, ఆలోచింపచేస్తుంది. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా చిరునవ్వుతో బయటకు వస్తారు.  

పాయల్ మాట్లాడుతూ..  ఇది నేను ఫస్ట్ సైన్ చేసిన ఫిలిం. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. కథ చెప్పినప్పుడు నేను చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా గ్రామాల్లోనే ఉంటారు. ప్రతి ఒక్కరికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండాలనేది మా ఆలోచన. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను.

అనీష్ కురివిల్లా మాట్లాడుతూ.. నేను ఎక్కువ శాతం ఫస్ట్ టైం డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ దగ్గర పని చేశాను. ఆ విషయంలో చాలా గర్వంగా ఉంది. ఇది చాలా స్పెషల్ ఫిలిం. మధు అరవింద్ చాలా ఫ్యాషన్ తో పనిచేశారు. కథని నమ్మి చేసిన సినిమా ఇది. సినిమాలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటూ మీ అందరిని అలరిస్తుం.చాలా సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు

సత్య కృష్ణ మాట్లాడుతూ.. ఒక రైతు పడే తపన సిటీలో చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్లకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. మనందరం అల్టిమేట్ గా భోజనం చేసే బ్రతకాలి. అది కావాలంటే రైతులు పండించాలి. పండించడం అనేది చాలా కష్టమైన పని. దానిపై ఒక సినిమా చేయడమనేది చాలా గొప్ప విషయం. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది

ప్రొడ్యూసర్ అరవింద్ మాట్లాడుతూ .. ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది ఒక ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటూనే హైలీ ఎంటర్టైంగా ఉండే సినిమా. ఈ ఈవెంట్ కి పల్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రొం హోం అని పెట్టాం. ఈ సినిమా పల్స్ ఏమిటో ఆడియన్స్ కి తెలియాలని.  అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉంటూనే మీనింగ్ ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం.

ప్రెసెంటర్ బాబ్జి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సినిమా  అద్భుతంగా వచ్చింది. ఇది మామూలు సినిమా కాదు టీజర్ శాంపిల్ మాత్రమే. ట్రైలర్ అదిరిపోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. సినిమా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

అశోక్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మూడు రోజుల క్రితమే ఈ కంటెంట్ చూపించారు. వర్క్ ఫ్రం హోం అనేది చాలా అద్భుతమైన టైటిల్. చాలామంది యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు విడిచిపెట్టి ఆర్గానిక్ వ్యవసాయం వైపు రావడం మనం గమనిస్తూ ఉంటాం. రానున్న రోజుల్లో వ్యవసాయం అనేది అగ్రస్థానంలో అగ్రస్థానంలోకి వెళ్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా వ్యవసాయం మీద చాలా ఒక అభిప్రాయం లో చాలా మంచి మార్పు వస్తుంది అని నమ్మకం ఉంది. అగ్రికల్చర్ ని మనం ఏదో రకంగా సపోర్ట్ చేయాలి. చదువుకున్న టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళందరికీ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళగళ్తే మన దేశం కూడా అగ్రస్థానంలో ఉంటుంది. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. కచ్చితంగా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. టీజర్ చుసిన తర్వాత చాలా అనందంగా అనిపించింది. ఇలాంటి పాయింట్ తో పదేళ్ళ క్రితం ఓ కథని మేము అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆ తరహ అంశాన్ని చాలా అద్భుతంగాచూపించారు. ఈ సినిమాలో చేసిన చాలామంది నాకు తెలుసు. సాఫ్ట్వేర్ నుంచి సినిమాల్లోకి చాలా మంది వస్తున్నారు. ఇది శుభ పరిణామం. సినిమా టీజర్ చాలా బావుంది. త్రిగుణ్  కు మరో విజయం వస్తుందని నమ్మకం ఉంది. డైరెక్టర్ గారు మంచి స్క్రిప్ట్ తో పాటు నటీనటులని ఎంపిక చేసుకున్నారు . సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  

బివిస్ రవి మాట్లాడుతూ.. టీజర్  చూస్తున్నప్పుడు ఇందులో కథ ఉందని అనిపించింది. టీజర్ లో కథ చెప్పిన సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని నమ్మకం ఉంది. ఈ సినిమాలో వ్యవసాయం గురించి మిల్లెట్స్ గురించి డిస్కస్ చేసినట్టుగా టీజర్ చూస్తే అనిపిస్తుంది. ప్రధాని మోడీ గారు కూడా మిల్లెట్స్ గురించి మాట్లాడారు.  త్రిగుణ్  చాలా అద్భుతమైన పెర్ఫార్మర్. చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈషాతో మంచి హిట్ కొట్టాడు. అరవింద్ మధు చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది.  

నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు

దర్శకత్వం: మధుదీప్ చెలికాని
నిర్మాత: అరవింద్ మండెం
సమర్పణ: CH.V.S.N బాబ్జీ  
 బ్యానర్ : లోటస్ క్రియేటివ్ వర్క్స్
స్క్రిప్ట్ కోఆర్డినేటర్: పవన్ కొడాలి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రవికుమార్ వి.
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: ప్రకాష్ చెరుకూరి
సౌండ్ డిజైనర్: సంతోష్ వొదనల
యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ సుంకర
పబ్లిసిటీ డిజైన్స్: JK ఫ్రేమ్స్
PRO: తేజస్వి సజ్జా

TFJA

Recent Posts

‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…

22 hours ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…

22 hours ago

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

5 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago