టాలీవుడ్

జూలై 7న ఓసాథియా మూవీ రిలీజ్

ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై
తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది.

ఓ సాథియా చిత్రం విడుదల తేది ప్రకటించిన తర్వాత నిర్మాత సుభాష్‌ మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కావడానికి ముఖ్య కారణం UFO మూవీస్ సంస్థ ఏ.పి, తెలంగాణ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.లక్ష్మణ్‌ అని చెప్పారు. లక్ష్మణ్ గారు ‘ఓ సాథియా’ సినిమా చూసి హీరో హీరోయిన్ బాగా చేశారని, మూవీ డైరెక్షన్ బాగుందని చెప్పారని తెలిపారు. ఈ సినిమా కి పాటలు బ్యాక్ బోన్ అని, ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేము సపోర్ట్ చేస్తామని ఆయన ముందుకొచ్చినట్లు నిర్మాత సుభాష్ చెప్పారు.

ఇటువంటి సినిమాలో కంటెంటే బలం అని నమ్ముతున్నాను అని చెప్పిన నిర్మాత సుభాష్.. తమ ఓ సాథియా చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నందుకు గాను UFO మూవీస్ వారికి స్పెషల్ థాంక్స్ చెప్పారు.

ఈ చిత్రానికి డిఓపి– ఈ.జె.వేణు, ఎడిటర్‌– కార్తీక్‌ కట్స్, సంగీతం– విన్నూ, లిరిక్స్‌– భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల, కొరియోగ్రఫీ– రఘు, బాబా భాస్కర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– చంద్ర తివారి, లైన్‌ ప్రొడ్యూసర్‌– వంశీకృష్ణ జూలూరి, పీఆర్ఓ౼ సాయి సతీష్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

15 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago