సెన్సార్ సభ్యుల ప్రశంసలందుకున్న ఓ సాథియా.. జూలై 7న గ్రాండ్‌గా విడుదల

Must Read

లవ్ స్టోరీల్లో డిఫరెంట్ యాంగిల్ తీసుకొని సరికొత్త ప్రేమకథా చిత్రంగా ఓ సాథియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటిస్తున్నారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది.

సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది ఓ సాథియా మూవీ. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రంలోని సన్నివేశాలపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ జోష్ లో ప్రముఖ నటులు ఆలీ ఇంటరాక్ట్ కావడం, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ చేయడం లాంటి అంశాలు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించారు.

చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ సాథియా మూవీ విడుదల కాబోతోంది. పలు సూపర్ హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన UFO మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని జూలై 7న గ్రాండ్ గా విడుదల చేయబోతోంది. దీంతో చిత్ర రిలీజ్ కి ముందే మంచి బజ్ నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ యూత్ ఆడియన్స్ మెప్పు పొందుతూ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ప్రతి వ్యక్తి జీవితంలో మెమొరబుల్ గా నిలిచే ఫస్ట్ లవ్ బేస్ చేసుకొని ఆసక్తికరంగా ఈ కథను మలిచారని చిత్ర అప్‌డేట్స్ స్పష్టం చేశాయి.

ఈ చిత్రానికి డిఓపి ఈ.జె.వేణు, ఎడిటర్‌– కార్తీక్‌ కట్స్, సంగీతం– విన్నూ, లిరిక్స్‌– భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల, కొరియోగ్రఫీ– రఘు, బాబా భాస్కర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– చంద్ర తివారి, లైన్‌ ప్రొడ్యూసర్‌– వంశీకృష్ణ జూలూరి.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News