టాలీవుడ్

‘జీ5 కేర‌ళ‌’లో ‘నునక్కుళి’…సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్

ఇండియాలో అంద‌రినీ ఆక‌ట్టుకుంటో ముందుకుసాగుతోన్న స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో జీ 5 ముందు వ‌రుస‌లో ఉంది. ఇలాంటి మాధ్య‌మంలో రీసెంట్‌గా థియేట‌ర్స్‌లో మంచి విజ‌యాన్ని అందుకున్న చిత్రం ‘నునక్కుళి’  స్ట్రీమింగ్ కానుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. బాసిల్ జోసెఫ్‌, గ్రేస్ ఆంటోని ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ కావ‌టాని కంటే ముందే జీ5 కేర‌ళ‌లో ప్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్స్‌ను సాధించటం విశేషం. ఈ క్ర‌మంలో మ‌నోర‌థంగ‌ల్‌, పప్ప‌న్‌, సూప‌ర్ శ‌ర‌ణ్య చిత్రాల‌ను ఈ చిత్రం అధిగ‌మించింది. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో బాసిల్ జోసెఫ్ ను మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో చూడ‌టానికి ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నున‌క్కుళి సినిమా సెప్టెంబ‌ర్ 13 నుంచి మ‌ల‌యాళంతో పాటు తెలుగు, క‌న్న‌డ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

https://zee5.onelink.me/RlQq/buvuvirr

నున‌క్కుళి సినిమా విష‌యానికి వ‌స్తే ఎబి (బాసిల్ జోసెఫ్‌)కు సంబంధించిన క‌థ‌. ఇత‌ని ల్యాప్ ట్యాప్‌ను ఓ ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్ సీజ్ చేస్తాడు. అందులో ముఖ్య‌మైన స‌మాచారం అంతా ఉంటుంది. దాన్ని తిరిగి పొంద‌టానికి ఎబి ఏం చేశాడ‌నేదే సినిమా. ఈ మిష‌న్‌లో రెష్మిత (గ్రేస్ ఆంటోని) అనే విడాకులు తీసుకున్న మ‌హిళ‌తో క‌లిసి ప్ర‌యాణం చేస్తాడు. ఇందులో చ‌నిపోయిన ఓ దంత‌వైద్యుడు, నిర్బంధంలోని ఓ మ‌హిళ‌, ఫిల్మ్ మేక‌ర్ కావాల‌నుకునే వ్య‌క్తి తార‌స‌ప‌డ‌తారు. వారి మ‌ధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. క‌థ‌లో ఉహించ‌ని ట్విస్టులు ఎదుర‌వుతాయి. ఎబి త‌న ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట ప‌డ‌కుండా ఉండాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే ఓ ట్విస్ట్ కార‌ణంగా త‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. ఉహించ‌ని మ‌లుపుల‌తో పాటు చ‌క్క‌టి హాస్యం కూడా మిళిత‌మైన సినిమాగా నున‌క్కుళి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది.

* సెప్టెంబ‌ర్ 13 నుంచి జీ5లో ‘నునక్కుళి’ మలయాళంతోపాటు కన్నడ, తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ రోల‌ర్ కోస్ట‌ర్ జీ5లో ఎక్స్‌క్లూజివ్‌గా ఎంజాయ్ చేయండి

Tfja Team

Recent Posts

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…

7 hours ago

Thanks Vinayak For Launching Teaser Of Barabar Premistha

The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…

7 hours ago

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…

8 hours ago

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…

8 hours ago

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…

9 hours ago

Second Schedule of Sci-Fi Action Killer has been wrapped up

Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…

9 hours ago