కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా మనకు పరిచయమైన కుర్రాడు జూనియర్ ఎన్టీఆర్. పేరుకు జూనియర్ అయినా.. పోలికల్నుంచి ప్రతిభ వరకూ సీనియర్ ను తలపిస్తోన్న కుర్రాడీ తారక్ రాముడు. మీసాలు కూడా రాకుండానే బాక్సాఫీస్ ను షేక్ చేసి.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడిగా నిలిచిన ఈ యంగ్ టైగర్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఈ నవరస నటుడి సినీ ప్రయాణాన్ని ఓ సారి చూద్దాం..
స్పాట్ ః మాంటేజ్ విత్ ఇమేజెస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పసితనంలోనే రాముడయ్యాడు. నిన్ను చూడాలని వెండితెర తహతహలాడుతోంటే.. పసితనపు ఛాయలు వీడకుండానే ఆదిగా అదరగొట్టిన స్టూడెంట్ నెంబర్ వన్ అతను. సింహాద్రిగా సింహగర్జన చేసి తెలుగు సినిమా బాక్సాఫీస్ కు సునామీని చూపించిన ప్రతిభావంతుడు. వరుస విజయాలతో సరికొత్త స్ట్రాటజీ చూపించి సరిగ్గా మీసాలు కూడా రాకుండానే మెగాస్టార్ కు పోటీ అవుతాడా అనిపించాడు.
హీరోల కొడుకులు కూడా హీరోలయిన తర్వాత.. ఆ హీరోల మనవలు కూడా హీరోలే అవుతోన్న తొలి సందర్భంలో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. అంతకు ముందే బాల నటుడుగా బాలరామాయణం అనే సినిమా చేసి ఔరా అనిపించాడు. నందమూరి తారకరామారావుకు తగ్గ మనవడుగా బాలరామాయణంలోనే అనిపించుకున్నాడు. రాబోయే కాలానికి కాబోయే స్టార్ గా అప్పుడే ఆశీర్వాదాలు అందుకున్నాడు. అది ఆదిగా వచ్చి ఇప్పుడు టాప్ స్టార్ గా ఎదిగిన వరకూ అతని నట ప్రస్థానమంతా అత్యంత ప్రతిభావంతంగానే సాగింది.
వారసత్వం ఎంట్రీ కార్డ్. తర్వాత టాలెంటే ఫైనల్. నిన్ను చూడాలనితో రామోజీ రావు తారక్ ను హీరోగా పరిచయం చేశాడు.
సినిమా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇతను హీరో ఏంటీ, వారసత్వం ఉంటే ఎవరైనా హీరో అయిపోవచ్చా అన్నారు. ఎన్టీఆర్ బొద్దుగా ఉండటం.. మరీ లేతగా కనిపించడం.. ఆ కథలో ఏ కొత్తదనం లేకపోవడంతో పాటు సినిమా ఆడకపోవడం వంటి కారణాలన్నీ ఈ విమర్శలకు కారణం. అసలు అతను హీరో ఏంటీ అనే విమర్శలు కూడా వచ్చాయి.విమర్శలను తిప్పి కొట్టాలంటే పనితోనే చూపించాలి. ఆ పని వెంటనే చేశాడు ఎన్టీఆర్. ఎంతో ప్రతిభ ఉన్నా అప్పటికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఆ టైమ్ లో ఓ కొత్త దర్శకుడు అతన్ని నమ్మాడు. ఇద్దరికీ అది ఛాలెజింగ్ సినిమా.. ఆ ఛాలెంజ్ లో ఈ ఇద్దరూ డిస్టింక్షన్ లో పాసయ్యారు. ఆ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. కట్ చేస్తే ఇప్పుడీ ఇద్దరూ వారివారి స్థానాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు. ఆ స్నేహం కూడా ఇంకా చెరగలేదు. కొన్ని కథలు అలా కలిసొస్తాయి.
జూనియర్ ఎన్టీఆర్.. పెద్దాయన వారసుడిగా వచ్చాడు. సాధారణంగా సినిమాలు చేస్తే సరిపోదు. హిట్లు మాత్రమే కాదు.. ఏం హిట్టు కొట్టాడ్రా అనే పేరు కావాలి. ఈ సారి మరో కొత్త దర్శకుడు వచ్చాడు. సరిగ్గా పంతొమ్మిదేళ్లు మాత్రమే ఉన్న ఈ బుడ్డోడిని నమ్మి అతి పెద్ద సినిమా చేశాడు. ఇది అప్పటికి తారక్ కెపాసిటీకి అస్సలు సరిపోయే కథ కాదు. కానీ చేశాడు. ఎందుకంటే అతను ఎన్టీవోడి వారసుడు కదా. అదే ఆది. ఆది గా అతను తొడగొడితే బాక్సాఫీస్ ఉలిక్కి పడింది.
9కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆది.. 22కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 121సెంటర్స్ లో 50రోజులు, 96కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. అప్పటికి నరసింహనాయుడు తర్వాత హయ్యొస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఆది చరిత్ర సృష్టించింది. సరిగ్గా మీసాలు కూడా రాని 19యేళ్ల కుర్రాడు చేసిన గర్జన ఇది.
మళ్లీ రాజమౌళి రంగంలోకి దిగాడు. విజయేంద్ర ప్రసాద్ కథ. ఈ కథలోని వెయిట్ కూ ఎన్టీఆర్ స్టామినా సరిపోదనుకున్నారు. కానీ అతని నటన చూసిన తర్వాత అప్పటి వరకూ అతన్ని లైట్ గా తీసుకున్న టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా తమ స్టార్డమ్ ను తడుముకున్నారంటే అతిశయోక్తి కాదు. సింహాద్రిగా ఎన్టీఆర్ నట విశ్వరూపం ఇది. ప్రతి ఫ్రేమ్ లో తన నటనతో ఆడియన్స్ హార్ట్స్ లోకి వెళ్లిపోయాడు. అంత చిన్న వయసులో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. సింహాద్రి తర్వాత టాలీవుడ్ నెంబర్ గేమ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది.
సింహాద్రి టాలీవుడ్ లో ఇప్పటికీ చెరగని రికార్డ్ క్రియేట్ చేసింది. బహుశా ఈ రికార్డ్ ఇంకెప్పటికీ చెరగదేమో. 167కేంద్రాల్లో 50 రోజులు, 150కేంద్రాల్లో వంద రోజులు, అలాగే 52కేంద్రాల్లో డైరెక్ట్ గా 175రోజులు ఫుల్ రన్ తో ఓ సునామీ క్రియేట్ చేసింది సింహాద్రి. ఈ రికార్డ్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సింహాద్రితో ఆ తారకరాముడుకి మూడోతరంలో సిసలైన వారసుడు ఈ తారకరాముడే అనిపించుకున్నాడు.
సింహాద్రి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ స్టార్డమ్ ను ఎన్టీఆర్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. స్టోరీ జడ్జిమెంట్ గాడి తప్పింది. దీంతో వరుస గా ఫ్లాపులు. ఓ దశలో ఇతనేనా సింహాద్రి చేసింది అనిపించాడు. ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహా, అశోక్, రాఖి.. ఇలా చేసిన ప్రతి సినిమా వరుసగా పోయింది. అన్ని సినిమాలూ సింహాద్రి కావాలనే ఆరాటం కనిపిస్తుంది. ఇవి పోవడానికి ఇదో కారణం అనుకోవచ్చు. వీటిలో రాఖి ఫర్వాలేదనిపించినా.. అదే టైమ్ లో ఎన్టీఆర్ మరీ లావైపోయాడు. ఇది కూడా కొంత మైనస్ గా మారింది.
వరుసగా సినిమాలు పోతున్నాయి. దీంతో ఎన్టీఆర్ కెరీర్ పై నీలినీడలు ఏర్పడ్డాయి. ఈ టైమ్ లో మళ్లీ జక్కన్న రంగంలోకి దిగాడు. అది కూడా పూర్తి కండీషన్స్ పై. ఆ కండీషన్ ముందు ఎన్టీఆర్ లావు తగ్గాలని. అందుకోసం విపరీతంగా కష్టపడ్డాడు.. కష్టానికి ఎప్పుడూ ఫలితం ఉంటుంది కదా. కానీ ఈ పర్సనాలిటీతో వచ్చిన ఫస్ట్ మూవీ కంత్రి.
తర్వాత యమదొంగ. కంత్రి లుక్ కొంచెం తేడా అనిపించినా యమదొంగకు సెట్ అయిపోయాడు. ఇక యమదొంగ సినిమాకు ఎన్టీఆర్ డైలాగ్స్ కు ఎంత పెద్ద అప్లాజ్ వచ్చిందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోహన్ బాబుతో పోటీ పడి మరీ శెభాష్ అనిపించుకున్నాడు.
అదుర్స్ .. చారీ, నరసింహా రెండు పాత్రల్లో చారీగా తన నటనతో ఆ పాత్రను ప్రతి స్టార్ హీరో డ్రీమ్ రోల్ గా మార్చాడు. అప్పటి వరకూ ఊరమాస్ డైలాగ్స్ చెబుతూ కాస్త రూడ్ గా ఉండే పాత్రలు చేసిన ఎన్టీఆర్ చారీగా చేసిన హడావిడీకి పడిపడి నవ్వారు.
అతన్లోని ఈయాంగిల్ చిరంజీవి చంటబ్బాయ్ ని గుర్తుకు తెచ్చిందంటే అతిశయోక్తి కాదు. దీని తర్వాత బృందావనంలో ఫ్యామిలీ స్టార్ గా మారాడు. ఈ రెండు సినిమాలు తనలోని క్లాస్ యాంగిల్ ను ఆడియన్స్ కు చూపించాయి.
ఎన్టీఆర్ కు ఎందుకో మొదట్నుంచీ ఓ సెంటిమెంట్ ఉంది. ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. ఆ వెంటనే అన్ని సినిమాలూ పోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఓ రెండుమూడు సినిమాల తర్వాత ఆ పోవడం స్టార్ట్ అయింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ శక్తి వచ్చింది ఈ టైమ్ లోనే. ఊసరవెళ్లి ఫర్వాలేదు. దమ్ము ఫ్లాప్. బాద్ షా ఓకే. బాద్ షాతో ఓవర్శీస్ మార్కెట్ స్టార్ట్ అయింది. రామయ్యా వస్తావయ్యా, రభస.. ఇలా మిక్స్ డ్ రిజల్ట్. కానీ ఏదీ బ్లాక్ బస్టర్ కాదు.
ఎన్టీఆర్ గొప్ప నటుడు. నోడౌట్. కానీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడు. ఇదీ కంప్లైంట్. దీంతో అతను రీ థాట్ లో పడ్డాడు. అదే టైమ్ లో ఆడియన్స్ టేస్ట్ లో విపరీతమైన మార్పులు వచ్చాయి. వారి టేస్ట్ కు అనుగుణంగా మారకపోతే మనుగడే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి. దీంతో రూట్ మార్చాడు. సిక్స్ ప్యాక్ కూడా చేసి, ఈ సారి తనలోని మరో యాంగిల్.. టెంపర్ చూపించాడు.
ఆడియన్స్ కు ఆ టెంపర్ నచ్చింది. క్లైమాక్స్ తో మరోసారి తానెంత గొప్ప నటుడో చూపించాడు.
టెంపర్ తో తనేం చేస్తే ఆడియన్స్ ను నచ్చుతుందో తెలిసివచ్చింది. అంతే పూర్తిగా మారిపోయాడు. క్లాస్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి నాన్నకు ప్రేమతో అన్నాడు.
తన కెరీర్ లోనే ఫస్ట్ తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నాడు. గడ్డం నుంచి కాస్ట్యూమ్స్ వరకూ.. పూర్తిగా ట్రాన్స్ ఫామ్ అయిపోయాడు. ఇది జనాలకు నచ్చుతుందా అనే డౌట్ ఉన్నా.. సుకుమార్ ఇచ్చిన ధైర్యంతో దూసుకుపోయాడు. నాన్నకు ప్రేమతో బిగ్గెస్ట్ హిట్..
తర్వాత కొరటాల శివతో జనతా గ్యారేజ్. ఈ సినిమాలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఉన్నాడు. ఆయనకు ధీటుగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.
సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సెభాష్ అనిపించాడు. టెంపర్ నుంచి ఒక్కో సినిమాతో రేంజ్ పెంచుకుంటూ వెళ్లాడు. ప్రతి సినిమా కలెక్షన్స్ పరంగా రేంజ్ పరంగా ఎన్టీఆర్ ను మరో మెట్టు ఎక్కిస్తూనే ఉంది.
కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ సినిమా.. అనౌన్స్ అయినప్పుడే అంచనాలు పెంచింది. పైగా త్రిపాత్రాభినయం. ఇంకేముందీ ఎన్టీఆర్ నట విశ్వరూపం గ్యారెంటీ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఓ పాత్రలో నత్తితో నటించాడు. ఇక క్లైమాక్స్ లో అతని నటనకు కన్నీళ్లు పెట్టని వారు లేరు. మూడు పాత్రల్లో అతను చూపిన వేరియేషన్ కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు ఓ లెస్సన్. ఆ స్థాయిలో ఆట్టుకున్నాడు.
ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసిన అరవింద సమేతలో సినిమా అంతా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అద్భుతం అనిపించుకున్నాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడే తండ్రి హరికృష్ణ ప్రమాదంలో మరణించారు. ఆ దుఖాన్ని దాటి చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్.
ఇక ఎన్నాళ్లుగానో తెలుగు ప్రేక్షకులు కోరుకుంటోన్న మల్టీస్టారర్ సెట్ చేశాడు రాజమౌళి. రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఎప్పట్లానే అద్భుతంగా నటించాడు. కాకపోతే ఈ అద్భుతం ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. తెలుగు సినిమా నుంచి ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని ప్రపంచమే విస్తుపోయేలా చేశాడు.
ప్రస్తుతం కొరటాల శివతో కెరీర్ లో 30వ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో పాటు ఓ బాలీవుడ్ మల్టీస్టారర్ కూడా ఉంది.
ఎలా చూసినా.. ఈ కాలపు ఉత్తమ నటుల్లో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఆ నటనకు వైవిధ్యమైన కథలనూ ఎంచుకుంటూ తనదైన శైలిలో అలరిస్తోన్న ఎన్టీఆర్ ఇలాగే మనల్ని ఎంటర్టైనర్ చేయాలని కోరుకుంటూ ఈ నవరస నటుడికి మనస్ఫూర్తిగా బర్త్ డే విషెస్ చెబుతోంది తెలుగు 70ఎమ్ఎమ్.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…
The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…