మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్#VT14 లో నోరా ఫతేహి

Must Read

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తన14వ చిత్రాన్ని చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని  భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. #VT14 వరుణ్ తేజ్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ చిత్రం కానుంది.  

ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరి ని ఎంపిక చేశారు. మరో అప్‌డేట్ ఏమిటంటే నోరా ఫతేహి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానుంది. స్పెషల్ నంబర్స్ చేస్తూ పాపులరైన నోరా #VT14లో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఓ స్పెషల్ నెంబర్ లో కూడా సందడి చేయనుంది.  

#VT14 1960 వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. 60ల నాటి పరిస్థితులు,అనుభూతిని తీసుకురావానికి యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఈ నెల 27న హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. అదే రోజున మిగిలిన నటీనటులు, యూనిట్ ని అనౌన్స్ చేస్తారు మేకర్స్.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News