“కిల్లర్” మూవీ కోటి రూపాయల కాంటెస్ట్ లో ఎవరూ విన్ కాలేదు, దగ్గరగా ఆన్సర్ చెప్పిన 10 మందికి లక్ష రూపాయల చొప్పున బహుమతి ఇస్తున్నాం – యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్..!

ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకులు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది “కిల్లర్” మూవీ. ఈ సినిమాకు చేసిన కోటి రూపాయల కాంటెస్ట్ ప్రమోషన్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. సినిమా రిలీజై సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ కోటి రూపాయల కాంటెస్ట్ గురించి వివరాలు తెలిపారు యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్.

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ – మా సినిమాకు ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. క్రిటిక్స్ నుంచి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. కొందరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని కూడా తీసుకున్నాం. ఓవరాల్ గా మా మూవీకి రెస్పాన్స్, బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని చేయబోతున్నాం. అన్నారు.

యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ – “కిల్లర్” సినిమాకు మేము చేసిన ప్రమోషన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అయినా అనుకోని కారణాల వల్ల మేము ఆశించినంత థియేట్రికల్ రెస్పాన్స్ రాలేదు. 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఓటీటీ, ఇతర బిజినెస్ కలిపి 8 కోట్ల రూపాయల దాకా రిటర్న్స్ వచ్చాయి. మా పెట్టుబడి 5 కోట్లకు 8 కోట్ల రూపాయలు రావడం వల్ల బిజినెస్ పరంగా లాభాల్లోనే ఉన్నాం. కోటి రూపాయల కాంటెస్ట్ గురించి ఆ వివరాలు చెప్పాలనుకుంటున్నాం. మేము సినిమా ఇంటర్వెల్ అయిన 5 నిమిషాలకు సెకండాఫ్ ట్విస్ట్ ఒక్క లైన్ లో పంపాలని చెప్పాం. కానీ మా సినిమాకు కొన్ని చోట్ల రాత్రి 10, 10.30, 10.45 గంటలకు ప్రీమియర్స్ పడ్డాయి. అందుకే ఇచ్చిన 5 నిమిషాలు టైమ్ ను 30 నిమిషాలకు పెంచాం. అందులో తమ సమాధానాలతో మాకు 5 వేల మంది స్క్రీన్ షాట్స్ పంపారు. వాటిలో మేము అనుకున్న ఆన్సర్ ఎవరూ చెప్పలేకపోయారు. అయినా దగ్గర దగ్గరగా ఆన్సర్ పంపిన 10 మందిని సెలెక్ట్ చేశాం. వారు నాగేంద్ర (హైదరాబాద్) కేశవశర్మ (వైజాగ్), మురళి (హైదరాబాద్), సాగర్ (వైజాగ్), గోపి (హైదరాబాద్), హరి (వైజాగ్), కళ (వైజాగ్), ధృవ్ (హైదరాబాద్), వెంకట్ నాయుడు (హైదరాబాద్), భాను (హైదరాబాద్). వీరి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున 10 లక్షల బహుమతి ఇవ్వబోతున్నాం. ఈ విజేతలతో కలిసి లంచ్ చేస్తాం. త్వరలో కిల్లర్ 2 సినిమా కూడా ఉంటుంది. అన్నారు.

నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, ఎడిటింగ్, దర్శకత్వం – పూర్వాజ్
సమర్పణ – ఉర్వీశ్ పూర్వజ్
ప్రొడ్యూసర్స్ – పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ – జగదీశ్ బొమ్మిశెట్టి
స్క్రీన్ ప్లే ఎడిటర్ – పూర్వాజ్
మ్యూజిక్ – ఆశీర్వాద్, సుమన్ జీవ
చీఫ్ ఎడిటర్ – బి.మనోజ్ కుమార్
మాస్టర్ చీఫ్ ఎడిటర్ – శివ శర్వాణి
కాస్టూమ్ డిజైన్ – ఉదయశ్రీ పూర్వజ్
ఆర్ట్ డైరెక్షన్ – మణి
యాక్షన్ కొరియోగ్రఫీ – రాజ్ కుమార్ గంగపుత్ర
లైన్ ప్రొడ్యూసర్స్ – అయినాబత్తిన దశరథ మాధవ్, సీతారామారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీఎస్ బాష
డీఐ – మయసభ స్టూడియోస్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ ( జి.ఎస్. మీడియా )

TFJA

Recent Posts

భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ జోరు – అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం..!

మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు…

1 week ago

రెండు లక్షల మందితో పాట్నాలో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి రెండేళ్లు.. 2.6 లక్షల మంది ఆన్‌లైన్ వీక్షకులతో సరికొత్త మైలురాయి..!

2 లక్షలకు పైగా ప్రజలు హాజరవడం, 2.6 లక్షల మంది యూట్యూబ్ వీక్షకులు ఏకకాలంలో వీక్షించడంతో, భారతీయ సినిమా చరిత్రలో…

1 week ago

ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం..!

‘ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు…

1 week ago

ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మ‌య‌స‌భ‌’ చరిత్ర!

57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి తెలుగు రాజకీయ వెబ్…

1 week ago

చిత్ర పరిశ్రమకు అండగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి..!

AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం - సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి…

2 weeks ago

డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సూపర్ సక్సెస్, ఈ నెల 28, 29 తేదీల్లో నెల్లూరులో జరగనున్న ఆడిషన్స్..!

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…

2 weeks ago