‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ప్రతి విద్యార్థి చూడాల్సిన చిత్రం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య..!

నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ లో దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 12న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో టీం బిజీగా ఉంది.

ఈ చిత్రంలోని లిరికల్ వీడియో సాంగ్‌ను డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల అధినేత మల్క కొమరయ్య విడుదల చేశారు. డీపీఎస్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఇంటరాక్షన్ కార్యక్రమానికి ఆయన ప్రత్యేకంగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పిల్లల మనస్తత్వం, చదువుపై ఒత్తిడి, ముఖ్యంగా గణితం వంటి సబ్జెక్టుల పట్ల ఉండే భయాలను అధిగమించే మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రతి విద్యార్థి చూడాలి. మార్కులే పిల్లల ప్రతిభకు కొలమానం కాదు. ప్రతి చిన్నారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే’ అని పేర్కొన్నారు.

డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల విద్యార్థులందరికీ ఈ చిత్రాన్ని చూపించేలా కృషి చేస్తానని మరోసారి హామీ ఇచ్చి చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సరిత మేడమ్, వైస్ ప్రిన్సిపల్, చిత్ర దర్శకుడు నవీన్ దేశబోయిన, కథానాయకుడు ఆశిష్ గాంధీ, బాలనటులు మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా, ఇతర నటీనటులు, చిత్ర బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులతో చిత్ర బృందం నిర్వహించిన సరదా సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అలాగే బాలనటి ఊహా పుట్టినరోజు వేడుకలను విద్యార్థులు, చిత్ర బృందం సమక్షంలో ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 12 నుంచి థియేటర్లలో ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సందడి చేయనుంది.

నటీనటులు : మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి,

సాంకేతిక బృందం

బ్యానర్ : నమో జయం ప్రొడక్షన్స్
నిర్మాత : దివ్య ప్రవీణ్ బొలిశెట్టి
దర్శకుడు : నవీన్ దేశబోయిన
కెమెరామెన్ : ఐ ఆండ్రూ బాబు
మ్యూజిక్ : మోహిత్ కులకర్ణి
బాణీ, సాహిత్యం : ప్రవీణ్ బొలిశెట్టి
ఎడిటర్ : నందమూరి హరి, తారక రామారావు
ఆర్ట్ డైరెక్టర్ : టి. నాని
ప్రొడక్షన్ కంట్రోలర్ : తాజ్ బాషా
పీఆర్వో : సాయి సతీష్
డిజిటల్ ప్రమోషన్స్ : ఇషాన్వి మీడియా, స్టార్ సర్కిల్

TFJA

Recent Posts

భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ జోరు – అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం..!

మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు…

1 week ago

రెండు లక్షల మందితో పాట్నాలో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి రెండేళ్లు.. 2.6 లక్షల మంది ఆన్‌లైన్ వీక్షకులతో సరికొత్త మైలురాయి..!

2 లక్షలకు పైగా ప్రజలు హాజరవడం, 2.6 లక్షల మంది యూట్యూబ్ వీక్షకులు ఏకకాలంలో వీక్షించడంతో, భారతీయ సినిమా చరిత్రలో…

1 week ago

ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం..!

‘ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు…

1 week ago

ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మ‌య‌స‌భ‌’ చరిత్ర!

57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి తెలుగు రాజకీయ వెబ్…

1 week ago

చిత్ర పరిశ్రమకు అండగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి..!

AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం - సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి…

2 weeks ago

డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సూపర్ సక్సెస్, ఈ నెల 28, 29 తేదీల్లో నెల్లూరులో జరగనున్న ఆడిషన్స్..!

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…

2 weeks ago