కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక ఎన్ఎం గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా విశెస్ అందిస్తూ టాలీవుడ్ లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. థియేటర్ ఆర్ట్స్ మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న నిహారిక తన పదో తరగతిలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. వివిధ అంశాలపై తన అభిప్రాయాలు తెలిపేలా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సబ్ స్క్రైబర్స్ ను ఆకట్టుకుంటుంది.
క్రమంగా సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్, కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. నిహారికకు సోషల్ మీడియాలో 6 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇటీవల యూట్యూబ్ ఆధ్వర్యంలో జరిగిన క్రియేటర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో ఇండియా నుంచి వరుసగా రెండోసారి రిప్రజెంట్ చేసింది. కొన్ని ముఖ్యమైన సామాజికాంశాలపై అవేర్ నెస్ తెచ్చేలా నిహారిక కంటెంట్ క్రియేట్ చేస్తోంది. తను చదువుకున్న యూఎస్ కాలిఫోర్నియా చామ్ మాన్ యూనివర్సిటీలో నిహారిక ఎన్ఎం కెరీర్ లో ఎదిగిన విధానంపై కేస్ స్టడీ చేస్తుండటం విశేషం. టాలీవుడ్ లో కూడా నిహారిక ఎన్ఎంకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అనుకోవచ్చు.
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…
ఈషా రెబ్బ, అనన్య నాగళ్ల, నందిని రాయ్, దినేశ్ తేజ్, అజయ్ కతుర్వార్, యశ్విన్ వేగేశ్నలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం…