విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్ బస్టర్ విజయాల తరువాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇటీవల ప్రారంభమైంది. విరూపాక్ష, బ్రో చిత్రాలతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన కథానాయకుడు సాయి దుర్గ తేజ్ ఈ సారి మరింత ఉత్సాహంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను నిర్మాతలు శుక్రవారం విడుదల చేశారు.
ల్యాండ్ మైన్‌లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతుతన్నట్లు కనిపిస్తుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌తో, భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ఈ చిత్రం కోసమే నిర్మించిన ఓ భారీ సెట్‌తో ప్రస్తుతం ఈ చిత్రం తొలిషెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఎస్‌డీటీ 18 రూపొందుతోంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…