న్యూ ఏజ్, పెప్పీ తెలుగు మ్యూజిక్ వీడియో ఇన్ టౌన్

Must Read

తెలుగు సినిమాలానే మ్యూజిక్ కల్చర్ కూడా అద్భుతం గా ఎదుగుతోంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన న్యూ ఏజ్ మ్యూజిక్ వీడియో ఆసక్తికరంగా కనిపించడమే కాకుండా మ్యూజిక్ కల్చర్ ని న్యూ లెవల్ తీసుకువెళుతుందని భరోసా ఇస్తోంది.   ఈ పాటకు డెన్నిస్ నార్టన్ సంగీతం అందించారు. ఈ పాటకు రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పాడగా, ఎ. వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు.

పద పద అని సాగే ఈ పాట టోక్యోలో చిత్రీకరించబడిన మొదటి సౌత్ ఇండియన్ మ్యూజిక్ వీడియో. బాబీ ఫిల్మ్స్, అయేరా స్టూడియోస్, యు రూబీ నాజ్ నిర్మిస్తున్నారు. సాహిత్యం కృష్ణకాంత్, కొరియోగ్రఫీ విష్ణుదేవా.

విజువల్స్ టోక్యో కొని అందమైన దృశ్యాలతో ఆహ్లాదకరంగా వున్నాయి. పాట చాలా ఆకర్షణీయంగా ఉంది. మ్యూజిక్ వీడియో జపాన్ స్పిరిట్, స్వేచ్ఛాయుతమైన అమ్మాయిని ప్రజంట్ చేస్తోంది.

అనుపమ జపనీస్ అవతార్‌లో ముఖ్యంగా కిమోనోలో చాలా అందంగా ఉంది. ఆమె తన బబ్లీ స్మైల్‌తో అద్భుతంగా కనిపించింది. మ్యూజిక్ వీడియో ఎక్సయిటింగా వుంది. ఇది ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో కల్చర్ ని వేరే స్థాయికి తీసుకువెళుతోంది.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News