‘ది రెడ్ బ్యాగ్’ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘నీ వెనకే’.. ఆకట్టుకుంటోన్న బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్

Must Read

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘డిస్కో లైట్’ సాంగ్ యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది.

ఇక తాజాగా ‘నీ వెనకే’ అంటూ సాగే ఓ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటకు ఆయన గాత్రం ప్రధాన ఆకర్షణ. ఈ పాటకు తిరుపతి జావన సాహిత్యం అందించారు.. శేఖర్ మోపురి బాణీ ఎంతో ఫీల్ గుడ్‌గా అనిపిస్తోంది. ఇక ఈ పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

మ్యూజికల్ ప్రమోషన్స్‌తో చిత్రయూనిట్ అందరిలోనూ అంచనాల్ని పెంచేస్తోంది. ఈ సినిమా ఆగష్ట్ 14న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

నటీనటులు : కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : మెమరీ మేకర్స్
నిర్మాత : హరికృష్ణ సోమిశెట్టి
దర్శకుడు : రవికుమార్ సీరపు
మ్యూజిక్ : శేఖర్ మోపురి
డీఓపీ : ప్రియేష్ గురుస్వామి
ఎడిటింగ్ : శివ శర్వాణి
పీఆర్వో : సాయి సతీష్

Latest News

‘ఇరుముడి’ కి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయి. ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ గారి సినిమాల్లో నా ఫేవరెట్ ఇరుముడి: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన...

More News