నా శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను – ‘అగధ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

Must Read

‘ఒక్కడు’ సినిమాకి మహేష్ బాబు కరెక్ట్, ‘వర్షం’కి ప్రభాస్ కరెక్ట్, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’కి సిద్ధార్థ్ కరెక్ట్, ‘మనసంతా నువ్వే’కి ఉదయ్ కిరణ్ కరెక్ట్, ‘అగధ’ మూవీకి ఇందులో నటించిన వారంతా కరెక్ట్ – ‘అగధ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు డా. కెవిఎల్ఎన్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ .. ‘‘అగధ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అజయ్ గారు, కాశీ విశాలాక్షి గారు ఈ ప్రయాణంలో నాకెంతో సపోర్ట్ చేశారు. ‘ఆరిజిన్ ఆఫ్ అగధ’ కూడా చాలా వైరల్ అయింది. మున్ముందు ఈవెంట్లలో టీం అందరికీ గురించి చెబుతాను. ఆగస్ట్ 14న ‘అగధ’ రిలీజ్ కాబోతోంది. అది నాకు మంచి డేట్ అనిపిస్తోంది. ఆ డేట్‌కి వచ్చే ప్రతీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తారు. ‘అగధ’ సినిమాని అంత సులభంగా తెరకెక్కించలేరు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వంటివి ఎక్కువగా ఉన్న ఈ మూవీని ఏడాదిలోనే పూర్తి చేశాం. రాకేష్ ఈ మూవీకి అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. పూర్తిగా భక్తిరస చిత్రాన్ని తీసినా కష్టమే అవుతుంది. యూత్, జెన్ జీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అన్ని రకాల అంశాల్ని ఇందులో పొందుపర్చాం. నాకు రిటైర్ అవ్వడం అనేది ఇష్టం ఉండదు. నా శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను. కథకి ఎవరు నప్పుతారు అన్నది మాత్రమే చూసి.. ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేసుకుంటాను. ‘అగధ’ కోసం అద్భుతమైన ఆర్టిస్టుల్ని తీసుకున్నాను. ఇంతకు ముందు నేను చేయని కథల్ని ఇప్పుడు ట్రై చేయాలని అనుకుంటున్నాను. చిన్నప్పుడు నాకు గాలి సోకిందని కొన్ని రోజులు స్కూల్ కూడా మాన్పించారు. ఆ సంఘటన నా మదిలో అలా ఉండిపోయింది. అది కూడా ఈ ‘అగధ’ చేయడానికి ఒక కారణం. అందరూ మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఎక్కువ స్క్రీన్‌లలో మూవీని రిలీజ్ చేయబోతోన్నాం. మాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని నమ్ముతున్నాను. అన్ని భాషల్లో డబ్బింగ్ రెడీ చేసి పెట్టాం. కానీ ముందు తెలుగు మీద ఫోకస్ పెట్టమని అంతా సలహా ఇచ్చారు. అందుకే అన్ని చోట్లకు వెళ్లి హడావిడిగా ప్రమోషన్స్ చేయడం లేదు. ముందు మా మూవీ గురించి ఇక్కడి ఆడియెన్స్ మాట్లాడాలి. కొన్ని స్క్రీన్‌లలోనే వేద్దామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. అతనికి పూర్తి చిత్రాన్ని చూపించాను. దాంతో ఓవర్సీస్‌లో ఆయనే భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. ‘ఒక్కడు’ సినిమాకి మహేష్ బాబు కరెక్ట్, ‘వర్షం’కి ప్రభాస్ కరెక్ట్, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’కి సిద్ధార్థ్ కరెక్ట్, ‘మనసంతా నువ్వే’కి ఉదయ్ కిరణ్ కరెక్ట్, ‘అగధ’ మూవీకి ఇందులో నటించిన వారంతా కరెక్ట్. శ్రవణ్, కామాక్షి, జోవికా, ఉల్కా అందరూ అద్భుతంగా నటించారు. ‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రతీ రోజూ ఉదయం మూడు గంటలకు నిద్ర లేచి స్క్రిప్ట్ రాసేవాడ్ని. ఆ కష్టమే మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘డిఫరెంట్ కారెక్టర్స్‌ను పోషించాలని ప్రతీ నటికి ఉంటుంది. ‘పొలిమేర’ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాత్ర నాకు లభించలేదు. కానీ రాజు గారు ఈ ‘అగధ’ కథ, అందులో నా పాత్రను చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయాను. నటిగా మళ్లీ నన్ను నేను ఫ్రూవ్ చేసుకోవడానికి చక్కటి అవకాశం లభించింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ప్రతీ సినిమాకి కష్టపడి ప్రమోషన్స్ చేస్తుంటాను. ‘అగధ’కి కూడా అదే స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నాను. నేను చేసే ప్రతీ సినిమాకి, అందులోని పాత్రకు వ్యత్యాసం ఉండేలా చూసుకుంటాను. నటిగా నాకు డిఫరెంట్ పాత్రలు వస్తుండటం నా అదృష్టం అనే చెప్పాలి. ‘అగధ’ వల్ల నాలో ఎంతో మార్పు వచ్చింది. ఇంతకు ముందు కంటే కామ్ అయ్యాను. స్పిరిట్యువల్‌గా మారిపోయాను. ఆగస్ట్ 14న ‘అగధ’ అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.

శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘అగధ’ జర్నీ నాకెంతో ప్రత్యేకం. నేను ఎప్పుడూ సింపుల్ సినిమాల్ని చేయలేదు. రాజు గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆయన్నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. ‘డర్టీ హరి’ తర్వాత ‘అగధ’లో నాకు మంచి పాత్రను ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని అన్నారు.

కాశీ విశాలాక్షి మాట్లాడుతూ .. ‘‘అగధ’ చిత్రీకరణ సమయంలో నేను కూడా సెట్‌కి వెళ్లాను. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. ఇప్పటి వరకు రాజు గారు అంటే ‘దేవీ’, ‘వర్షం’ అని అంటున్నారు కదా.. ‘అగధ’ తర్వాత.. ‘అగధ’ రాజు అని అంటారు. ఆయన కథ చెప్పిన దాని కంటే అద్భుతంగా తెరకెక్కించారు. మళ్లీ ఆయనతోనే సినిమాని చేయబోతోన్నాం’ అని అన్నారు.

ఉల్కా గుప్తా మాట్లాడుతూ .. ‘రాజు గారు చెప్పిన ‘అగధ’ కథ నాకు ఎంతో నచ్చింది. పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన రాజు గారికి థాంక్స్. నా కెరీర్‌లో ‘అగధ’ ఓ మైల్ స్టోన్‌గా నిలుస్తుంది’ అని అన్నారు.

జోవికా విజయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘మాకు రాజు గారు ఫ్యామిలీ మెంబర్‌లా ఉంటారు. ప్రతీ సీన్‌ను ఎంతో గొప్పగా వివరిస్తారు. ఆయనకు గొప్ప విజన్ ఉంటుంది. ఆర్టిస్టులకు అర్థమయ్యేలా సీన్‌ను చెబుతారు. ఆయనతో నా మొదటి సినిమాని చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇలాంటి ఓ డిఫరెంట్ పాత్ర నా కెరీర్ ఆరంభంలోనే రావడం, పైగా అమ్మతో కలిసి నటించడం నా అదృష్టం’ అని అన్నారు.

నటీనటులు : కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు

సాంకేతిక బృందం:
రచయిత, దర్శకుడు: ఎం. ఎస్. రాజు
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: రాకేష్ వెంకటాపురం
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
అదనపు స్క్రీన్ ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ వి ఎన్ సుబ్బరాజు

Latest News

ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను”

-ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు కొండల్ "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్" సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్...

More News