బాలకృష్ణ,బోయపాటి శ్రీను ‘అఖండ 2 ఘనంగా ప్రారంభం

Must Read

ఇండియన్ సినిమాలో మోస్ట్ క్రేజీయస్ట్ కాంబినేషన్- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను -సింహ, లెజెండ్, అఖండ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత నాల్గవసారి కలిసి పని చేయనున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి చిత్రం అంచనాలను మించింది, NBKకి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా వారి గత చిత్రం ‘అఖండ’ చాలా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.  హిందీ డబ్బింగ్ వెర్షన్ ఉత్తరాది ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందింది.

ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలిగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించనున్న న్యూ మూవీ #BB4 అఖండ చిత్రానికి సీక్వెల్, దీనికి అఖండ 2 అని టైటిల్ పెట్టారు. ఇది బాలకృష్ణ, బోయపాటి ఇద్దరికీ మేడిన్ పాన్ ఇండియా మూవీ. 

అద్భుతంగా డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ డివైన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. టైటిల్ ఫాంట్ స్ఫటిక లింగం, ఒక శివ లింగాన్ని కలిగి ఉంది, ఇది డివైన్ ఇంపార్టెన్స్ ని సూచిస్తుంది. టైటిల్‌తో పాటు పవర్ ఫుల్ క్యాప్షన్- తాండవం, రెండు డమరుకంలు చుట్టుముట్టబడి, శివ నృత్యాన్ని సూచిస్తున్నాయి. బ్యాక్ డ్రాప్ లో హిమాలయాలు భక్తి వాతావరణాన్ని ఎలివేట్ చేస్తున్నాయి. టైటిల్ పోస్టర్ సీక్వెల్ మరపురాని గూస్‌బంప్- మూమెంట్స్ తో ఎపిక్  సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోందని సూచిస్తుంది.

మొత్తం కోర్ టీమ్, పలువురు అతిథుల సమక్షంలో అఖండ 2 ఈరోజు ఘనంగా ప్రారంభమైయింది. ముహూర్తం షాట్‌కు తేజస్విని కెమెరా స్విచాన్ చేయగా, బ్రాహ్మణి క్లాప్‌ కొట్టారు. ముహూర్తం షాట్ కు బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.

అఖండలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ ఈ సీక్వెల్‌లో పార్ట్ అయ్యారు, గ్రాండ్ లాంచ్ వేడుకకు హాజరయ్యారు.

కథలో ఆధ్యాత్మిక అంశాలను తెలిపే అఖండ 2 టైటిల్ థీమ్‌ను నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. Sఎస్ థమన్ పూనకాలు తెప్పించే బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలిచింది, ఇది గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ ని ప్రామిస్ చేస్తోంది. 

బాలకృష్ణను లార్జర్ దేన్-లైఫ్ క్యారెక్టర్స్‌లో ప్రెజెంట్ చేయడంలో బోయపాటి దిట్ట. ఎన్‌బికెని వెరీ కమాండింగ్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయడానికి యూనివర్సల్ అప్పీల్‌తో పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు బోయపాటి. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అఖండ 2 హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించబడుతుంది. ఇది బాలకృష్ణ, బోయపాటి ఇద్దరికీ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీగా నిలుస్తోంది. 

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సంతోష్ డి డెటాకేతో పాటు సి రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అఖండ 2 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్, ఈ సెన్సేషనల్ కాంబినేషన్ కోసం ప్రతి సినీప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ 2 రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మాన్యుమెంటల్ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి. 

నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను

నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట

బ్యానర్: 14 రీల్స్ ప్లస్

ప్రజెంట్స్: ఎం తేజస్విని నందమూరి

సంగీతం: థమన్ ఎస్

డీవోపీ: సి రాంప్రసాద్, సంతోష్ డి డెటాకే

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి

ఆర్ట్: ఏఎస్ ప్రకాష్

ఎడిటర్: తమ్మిరాజు

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News