డా.సుప్రీమ్‌ లాంచ్ చేసిన ‘నట రత్నాలు’ సెకెండ్‌ లిరికల్‌ సాంగ్‌

బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తాన, సుదర్శన్, రంగస్థలం మహేశ్‌, తాగుబోతు రమేష్, అర్జున్‌ తేజ్‌ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. మర్డర్‌ మిస్టరీ క్రేౖం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు.‘నటనటనటరత్నాలు ఛాన్స్‌ ఇస్తే పండిస్తా నవరసాలు’’ అంటూ సాగే సెకండ్‌ లిరికల్‌ సాంగ్‌ను డా. సుప్రీం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర పాల్గొన్నారు.

శంకర్ మహాదేవ్ స్వరకల్పనలో వినాయక్‌ ఈ పాటను ఆలపించారు. సీతారామ చౌదరి సాహిత్యం అందించారు.

దర్శకుడు శివనాగు మాట్లాడుతూ ‘‘కొద్దిరోజుల ముందు తాగుబోతు రమేశ్‌పై తెరకెక్కించిన పాటను విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తాన, సుదర్శన్, రంగస్థలం మహేశ్‌, తాగుబోతు రమేష్, అర్జున్‌ తేజ్‌లపై తెరకెక్కించాం. ఈ పాటకు కూడా స్పందన బావుంది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా స్పందన బావుంది. సినిమా అవుట్‌పుట్‌ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాం. ఆగస్ట్‌లో మంచి డేట్‌ చూసి సినిమా విడుదల చేస్తాం. పాటను విడుదల చేసిన సముద్ర, సుప్రీమ్‌గారికి కృతజ్ఞతలు. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అని అన్నారు.

వి.సముద్ర మాట్లాడుతూ ‘‘ఈ టైటిల్‌ వింటుంటూ సూపర్‌హిట్టైన జాతిరత్నాలు సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా ప్రారంభం నుంచి నాకు తెలుసు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. చక్కని ఆర్టిస్ట్‌లు నటించారు. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అని అన్నారు.

డా.సుప్రీమ్‌ బాబు మాట్లాడుతూ ‘‘సినిమా, పాటలు చూశా. చాలా బాగా వచ్చింది. నాన్న తన చిత్రాలతో ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటారు. ఈ సినిమా కూడా ఆ తరహాలోనే చేశారు’ అని అన్నారు.

అర్చన,
శృతిలయ,
సుమన్‌ శెట్టి,
టైగర్‌ శేషాద్రి,
చంటి, అట్లూరి ప్రసాద్‌,
ఖమ్మం సత్యానారాయణ,
సూర్య కిరణ్‌, ఎంఎన్‌ఆర్‌ చౌదరి, రంజిత్‌ కుమార్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు
లిరిక్స్‌: సీతారామ చౌదరి
ఎడిటర్‌: ఆవుల వెంకటేష్‌
సంగీతం: శంకర్‌ మహాదేవ్‌
పీఆర్వో: మధు విఆర్‌
సహా నిర్మాతలు: ఆనంద్ దాస్ శ్రీ మణికంఠ, వై.చంటి, కోయ సుబ్బారావు
నిర్మాత: డా దివ్య
దర్శకత్వం: శివనాగు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

3 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

3 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

3 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago