ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస ప్రాజెక్ట్‌లను తెరకెక్కిస్తోంది. మంచి చిత్రాలను అందించే క్రమంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాను మన ముందుకు తీసుకొస్తోంది. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా కేరళలో జరిగింది. ఇక కేరళ ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నరుడి బ్రతుకు నటన సినిమాలో కేరళ అందాలే హైలెట్ కానున్నాయి. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ వంటి వారు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీని రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ గారు, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూఛిబొట్ల గారు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు.
నరుడి బ్రతుకు నటన గ్లింప్స్ చూస్తుంటే కేరళను అలా చుట్టి వచ్చినట్టుగా, మన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తోంది. నవ్వు, బాధ, ప్రేమ, స్నేహం ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఎంతో సహజంగా చూపించినట్టుగా అనిపిస్తోంది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…