నరసింహాచారి, డా. సకారం మారుతి, భాస్కర్‌రెడ్డి, చిత్రం శ్రీను, మీనాక్షిరెడ్డి, పల్సర్ బైక్ ఝాన్సీ కీల పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రంగస్వామి’. డ్రీమ్ సినిమా పతాకంపై స్వీయ దర్శకనిర్మాణంలో నరసింహాచారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని సీనియర్ నటుడు సుమన్ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘యువత డ్రగ్స్ ఉపయోగించినప్పుడు ఎంత ఆనందిస్తున్నారో.. ఆతర్వాత ఎంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇందులో చక్కగా చూపించారు. యువతకు చక్కని సందేశమిస్తుంది. చాలా రోజుల తర్వాత చక్కని సందేశంతో కూడిన థ్రిల్లర్ చూసిన భావన కలిగింది. ట్రైలర్ చూశాక ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపించింది. ఎమోషన్స్ పండించడం చాలా కష్టం. ఈ చిత్రంలో దానికే ఎక్కువ మార్కులు పడతాయి. తండ్రీ కొడుకుల మధ్య చక్కని భావోద్వేగాలు పలికాయి. ఇలాంటి చిత్రంలో నాకు పాత్ర రాలేదని కాస్త బాధగా ఉంది. సినిమా చూశాక మెండ్ ఫ్రెష్ అయినట్లు అనిపించింది. ఇలాంటి కథలు రావడం చాలా ఈ సమాజానికి అవసరం’’ అని అన్నారు.
సకారం మారుతి మాట్లాడుతూ ‘‘దర్శకుడు చెప్పింది మేమంతా చేశాం. మట్టిని పిండి బొమ్మగా మలచినట్లు మా నుంచి చక్కని నటన రాబట్టారు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడిదే. సినిమాలపై ఎంతో అవగాహన, అనుభవం ఉన్న సుమన్‌గారు సినిమా చూసి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. పైగా ఈ సినిమా నచ్చి మా టీం చేసే తదుపరి చిత్రంలో తప్పకుండ అవకాశం ఇవ్వాలని సుమన్ మమ్మల్ని కోరడం చాల ఆనందంగా అనిపించింది’’ అని అన్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…