‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ విడుదల

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. గ‌త ఏడాది విడుద‌లైన ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని.. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రానికి ఇది కొన‌సాగింపు. చోళుల గురించి  తెలియ‌జేసే సినిమా ఇది. అత్య‌ద్భుతమైన విజువ‌ల్స్‌తో లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని మ‌ణిర‌త్నం సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తున్నారు.

భారీ తారాగ‌ణంతో రూపొందిన పొన్నియిన్ సెల్వ‌న్ 1 దాని కొన‌సాగింపు పీఎస్ 2 పై క్యూరియాసిటీని పెంచుతూ ముగిసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆడియెన్స్ పొన్నియిన్ సెల్వ‌న్ 2 ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు.  ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో `పొన్నియిన్ సెల్వ‌న్ 2` విడుద‌ల‌వుతుంది. దీనిపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి.  ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా పొన్నియిన్ సెల్వ‌న్ 2 ట్రైల‌ర్‌ను మార్చి 29న చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

సొన్నియిన్ సెల్వ‌న్ 2లో ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్‌, చియాన్ విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తి, త్రిష కృష్ణ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించిన ఈ చిత్రంలో శ‌ర‌త్ కుమార్‌, ప్ర‌భు, లాల్‌, కిషోర్‌, అశ్విన్ కాక‌మాను, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. చెన్నైలో పొన్నియిన్ సెల్వ‌న్ ట్రైల‌ర్‌తో పాటు ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సినిమాల న‌టించిన న‌టీన‌టుల‌తో పాటు ఇత‌ర సెల‌బ్రిటీలు ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశారు. భారీ సంఖ్య‌లో అభిమానులు కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ఈ ట్రైల‌ర్‌తో పీఎస్ 2పై ఉన్న మ‌రింతగా పెరిగాయి. 

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మిళం, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

24 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

24 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

1 day ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago