బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌ అవార్డ్ గెలుపొందిన నాని ‘హయ్ నాన్న’

Must Read

నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా నటించిన “హాయ్ నాన్న”, అంతర్జాతీయంగా “హాయ్ డాడ్”గా విడుదలై ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ మార్చ్ 2024 ఎడిషన్‌లో బెస్ట్  ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును కైవసం చేసుకుందని అనౌన్స్ చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము.

ట్యాలెంటెడ్ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన “హాయ్ నాన్న” అద్భుతమైన కథనం, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్, యూనిక్ సినిమాటిక్ విజన్ తో ప్రేక్షకులు, న్యాయనిర్ణేతలను ఆకర్షించింది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లభించిన ఈ గుర్తింపు నిర్మాతలుగా మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. అంతర్జాతీయ వేదికపై మా పని యొక్క యూనివర్సల్ అప్పీల్, క్యాలిటీని ధృవీకరిస్తుంది.

“ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘హాయ్ నాన్నా’కి ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా,  గౌరవంగా ఉంది” అన్నారు దర్శకుడు శౌర్యువ్. ఈ సందర్భంగా ఆయనకృతజ్ఞతలు తెలిపారు. “సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా కథ చెప్పే శక్తిని ఈ విజయం అందించింది. ఫెస్టివల్ నిర్వాహకులకు, జ్యూరీకి,  ‘హాయ్ నాన్నా’కి ప్రాణం పోసిన మా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.”అన్నారు


గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్‌లో “హాయ్ నాన్న” అకా “హాయ్ డాడ్”కు లభించిన మద్దతు, ప్రశంసలను చూసి మేము గర్విస్తున్నాము. ఈ అవార్డు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి సమిష్టి కృషికి నిదర్శనం. ఇది మరిన్ని అద్భుతమైన చిత్రాలని అందించడానికి మాకు స్ఫూర్తినిస్తుంది.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News