నూతన ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్డిసి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఎఫ్డిసి సభ్యులుగా ఎన్నికైన వారి ప్రమాణస్వీకారం అలాగే అధికార బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మధ్య ఒక కార్యక్రమం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఏపీ ఎఫ్డిసి నూతన చైర్మన్ గా ఎన్నికైన భరత్ భూషణ్ గారు అలాగే ఇతర సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసి ప్రసంగించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా కర్తవ్యం నిర్వహించి నా బాధ్యతను విజయవంతం చేస్తానని తెలియజేస్తున్నాను. 1984లో నందమూరి తారక రామారావు గారు ఒక కమిటీ వేసి సినీ పరిశ్రమలు అభివృద్ధి చేశారు. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో బాలకృష్ణ గారి సహకారంతో ఈ కమిటీను పూర్తిస్థాయిలో నిర్మించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాలకృష్ణ గారు తమ విలువైన సమయాన్ని సినీ పరిశ్రమ అభివృద్ధి చెందే వైపు, ఆంధ్రప్రదేశ్లో సినీ రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో ఈ కార్యక్రమంలో మాకు అన్ని విధాలుగా సహకరించి ఆయనకు జీవులకాలం ఉండబడి ఉంటాము. అలాగే పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ గారి సహకారంతో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు వచ్చినందుకు ముఖ్య కారణమైన నందమూరి బాలకృష్ణ గారికి, నందమూరి మోహన్ కృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నటుడు సుమన్ తల్వార్ గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ గారికి, నూతన ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి, తోటి సభ్యులకు అందరికీ నమస్కారం. ఒక నెల క్రితం బాలయ్య గారు ఫోన్ చేసి నాకు ఎఫ్డిసిలో బాధ్యత స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ లో సినీరంగం అభివృద్ధి చెందెందుకు మీరు తోడ్పడాలని అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఒక డైరెక్టర్ గా ఎన్నుకోవడం చాలా గర్వంగా అనిపించింది. ముందుగా ఇక్కడ స్టూడియోలు పెట్టుకునేందుకు ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు ముందుకు వచ్చారు. అది చాలా రిస్క్ అయినప్పటికీ వారు చిత్రపరిశ్రమ కోసం ఎంతో గొప్ప సాహసం చేశారు. హైదరాబాద్ లాగా అమరావతి కూడా ఒక సినీ హబ్ లా మారాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందాలని ఇంత శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి కారణమైన డిస్ట్రిబ్యూటర్స్ ను మనం కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో షూటింగులు జరిగితే తద్వారా మంచి ఆదాయం కూడా వస్తుంది. మనకు ఇప్పటికే ఎన్నో మంచి సౌకర్యమైన అందంగా ఉండే లొకేషన్స్ ఉన్నాయి. అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా శక్తిగా ఫిలిం డెవలప్మెంట్ ముందుకు తీసుకుని వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు వచ్చేలా చేస్తాను” అన్నారు.

నటి ఝాన్సీ గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నమస్కారం. ఈ రాష్టానికి రామారావు గారు ముఖ్యమంత్రిగా చేయడం సినీ పరిశ్రమ, తెలుగు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు అదే పరిశ్రమ నుండి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదే విధంగా బాలయ్య గారు ప్రభుత్వంలో ఉన్నారు. ఎంతో అనుభవం ఉన్న వారితో కలిసి ఈ బాధ్యతను స్వీకరించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సినీ పరిశ్రమ కోసం ఎంతగానో కృషి చేశారు. ఆ ఫలితాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాము. ఇప్పుడు అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు మెహర్ రమేష్ గారు మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినందుకు ఫెడరేషన్ సభ్యులుగా మమ్మల్ని ఎన్నుకోవడం ఎంతో గౌరవంగా ఉంది. కచ్చితంగా ఇక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా మేమంతా కలిసి కృషి చేస్తాము. పవన్ కళ్యాణ్ గారికి చిత్ర పరిశ్రమ మీద ఉన్న ప్రేమ ఈ అభివృద్ధిని ముందుకు వెళ్లేలా చేస్తుందని నేను నమ్ముతున్నాను” అన్నారు.

రచయిత బొర్రా సాయి మాధవ్ గారు మాట్లాడుతూ… “వాస్తవానికి మా అందరికీ ఇచ్చింది పదవులు కాదు, బాధ్యత. కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ లో సినీ రంగం, టీవీ & నాటక రంగం అభివృద్ధి చెందే బాధ్యత మాపై ఉంది. ఈ బాధ్యతలను మమ్మల్ని భాగస్వామ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మమ్మల్ని వెండి నుండి ప్రోత్సహిస్తున్న బాలకృష్ణ గారికిఅందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా అనుభవాన్ని ఉపయోగించి ఈ అన్ని రంగాలలో అభివృద్ధి చెందినందుకు నా ప్రయత్నంగా నేను కృషి చేస్తానని మాటిస్తున్నాను” అన్నారు.

నాటక రంగం నుండి కందిమల్ల సాంబశివరావు గారు మాట్లాడుతూ… “ముందుగా నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తున్నాను. ఆయనకు నాటక రంగం అంటే ఎంతో ఇష్టం. ఎంతోమంది కళాకారులకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలని, ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఉత్సవాలు జరగాలని కోరుకుంటున్నాను. ఒక స్పష్టమైన నివేదికతో భవిష్యత్ లో కూడా ఉండేలా చూడాలని, నాకు ఈ బాధ్యతను అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అనుకుంటున్నాను” అన్నారు.

దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. కృష్ణా నది తీరాన శ్రీ కనకదుర్గ అమ్మవారి పాదాల చెంత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మస్థలం నుండి ఒక మంచి కార్యంలో భాగస్వామ్యంగా ఉండటం గౌరవం. ఈ సందర్భంగా అమరావతిలో మేము ఒక స్టూడియో, అలాగే ప్రభుత్వ సహకారంతో రాష్ట్రమంతటా థియేటర్లు కడతాము. అలాగే కృష్ణా నది తీరంలో ఈ సంవత్సరం 5 సినిమాలు తీస్తామని హామీ ఇస్తున్నాను. ఒకప్పటి ఆంధ్ర ప్రదేశ్ సినీ వైభవం రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేశ్వర్ మాట్లాడుతూ… “ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు కొత్తగా పదవి స్వీకారం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారికి, ఇతర సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రత ప్రభుత్వ సమయంలో ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు అలాగే కళలకు ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఈ రంగాలకు ఎటువంటి ప్రోత్సాహం లేని సమయంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సహజంగానే కళల పట్ల, సినీ పరిశ్రమ పట్ల ప్రత్యేక అభిరుచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి పూర్తిస్థాయి సహకారాన్ని అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ అభివృద్ధితో పాటు కళను ప్రోత్సహించాలని ఆలోచనతో అన్ని ఉత్సవాలు ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఈ విధంగా ఎఫ్డిసి సభ్యులను నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలు అద్భుతంగా విడిసిల్లాలని ఉద్దేశంతో భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. నంది అవార్డులు కార్యక్రమం కొనసాగించే దిశగా ఉన్నాము. తెలుగు సినిమాలతో పాటు ఇతర సినీ పరిశ్రమ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి షూటింగులు చేసుకుంటున్నారు. ఇక్కడ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. మౌలిక సదుపాయాలను అందరికీ అందించే దిశగా పని చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ సినిమాలు చేసేవారికి అండగా నిలుస్తుంది, అని సౌకర్యాలు ఇస్తుందని తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఈ ఎఫ్డిసితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందుకు మరింత కృషి చేస్తుంది. మరోసారి ఎఫ్డిసి సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను” అన్నారు.

నటుడు, శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నూతన ఎఫ్డిసి చైర్మన్ గారికి, సభ్యులకు, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ వేరుగా విడిపోయిన తర్వాత ఎఫ్డిసి నియమించడం జరిగింది. ఈరోజు మరోసారి తిరిగి ఎఫ్డిసి సభ్యులను నియమించడం జరిగింది. ఈ ఎఫ్డిసి సభ్యులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికీ పేరుపేరున అభినందనలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు అందరం ఈ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని భావించాము. గతంలో కూడా విజయవాడ నుండి ఎంతో శనిరంగం అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ నుండి సినిమా కలెక్షన్లు చాలా భారీగా వస్తాయి. షూటింగ్స్ కోసం నేను కూడా ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో చేశాను. మంచి లొకేషన్స్ ఉన్నాయి. సినిమా షూటింగులు సజావుగా జరిగేందుకు ప్రభుత్వం, ప్రజలు సహకరించే విధంగా ఉంటుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఈ కృష్ణా జిల్లా నుండి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం మంచి విషయంగా భావిస్తున్నాను. సభ్యులు అందరూ వారి అనుభవాన్ని ఉపయోగించి అతివేగంగా ముందుకు తీసుకువెళ్ళాలి. అందరూ మంచి సినిమాలు చేయాలి. ప్రస్తుతం కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేవు, థియేటర్లు మూసివేయబడుతున్నాయి కానీ ఇకపై అలా జరగకుండా అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లాలి. చిత్ర పరిశ్రమను ఇక్కడ కూడా అభివృద్ధి చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అన్ని ఉత్సవాలు, ప్రోత్సాహాలతో కళను ముందుకు తీసుకువెళ్తాము. ఎక్కువ సినిమాలు చేయాలి, ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి. చిత్ర పరిశ్రమ ముందుకు వెళ్లాలి అని కోరుకుంటూ మరోసారి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా కృతజ్ఞతలు” అంటూ ఈ కార్యక్రమాన్ని ముగించారు.

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మా అసోసియేషన్, నిర్మాతల మండలి, 24 క్రాఫ్ట్స్ లో అన్ని విభాగాల వారు, అదేవిధంగా డిస్ట్రిబ్టర్స్, ఎగ్జిబిటర్స్ ఈ కార్యక్రమానికి హాజరై సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

15 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago