మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఈరోజు చిత్ర బృందం మూడవ సింగిల్ ‘హల్లల్ల ల్లో’ ని భోపాల్‌లో జరిగిన ‘పెద్ది కి ఆవాజ్’ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్ ఆయన బృందం ప్రత్యక్షంగా ప్రదర్శించారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో చాలా గ్రాండ్ గా జరిగింది.
‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. నమస్కార్ భోపాల్… మధ్యప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా మనసులో మీ అందరికీ ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘పెద్ది’ ప్రమోషన్స్‌ను భోపాల్ నుంచి ప్రారంభించడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ‘పెద్ది’ సినిమాను మేము ఎంతో మనసుపెట్టి తీశాం. ప్రతి భావోద్వేగం, ప్రతి కష్టం, ప్రతి క్షణాన్ని ఈ సినిమా కోసం అంకితం చేశాం. ఈ నగరం ఎంత అందంగా ఉందో, ఇక్కడి ప్రజల మనసులు అంతకంటే అందంగా ఉన్నాయి. జూన్ 4న మీ హృదయాల్లో మా సినిమాకు ఒక స్థానం కల్పించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించండి. రవికిషన్ గారు ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఆయనకు నా ధన్యవాదాలు. ‘పెద్ది’ ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు. తన గుర్తింపు కోసం పోరాడే ఒక వ్యక్తి కథ. ఆ పోరాటం మీ హృదయాలను తాకుతుంది. మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, స్ఫూర్తిని ఇస్తుంది. సినిమా చూసిన తర్వాత మళ్లీ మళ్లీ చూడాలనిపించే అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే సినిమా ఇది. ఈ సినిమా కోసం మేమంతా ఎంత కష్టపడి, ఎంత ప్రేమతో పనిచేశామో ఆ భావన ప్రేక్షకులందరికీ చేరుతుందనే నమ్మకం నాకు ఉంది. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, నా ఫిల్మ్ లైబ్రరీలో ‘పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది. మా నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు బుచ్చిబాబు గారికి, నా సహనటులు జాన్వీ కపూర్, దివ్యేందు, రవికిషన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా సినిమాకు అతి పెద్ద బలంగా నిలిచిన ఏఆర్ రెహమాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన భోపాల్ ప్రజలకు, పోలీసు శాఖకు, గౌరవ మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భోపాల్… నేను మళ్లీ వస్తాను. ‘పెద్ది’ సక్సెస్ టూర్ కూడా ఇక్కడే జరుపుకుంటాం. మీరు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఎంత ప్రేమ చూపించారో, అదే ప్రేమను ‘పెద్ది’కి కూడా అందిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకీ జై.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. భోపాల్ ప్రజలందరికీ నమస్కారం. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ‘పెద్ది’లో చాలా గొప్ప సందేశం ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. మనందరం రామ్ చరణ్ గారి అభిమానులమే. ఈ సినిమా కోసం ఆయన చూపించిన అంకితభావం, నిజాయితీ, కష్టపడి పనిచేసిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రతి పాత్రను ఎంత నిబద్ధతతో చేస్తారో ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు వంటి ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఆయన సంగీతం ఈ సినిమాకు మరింత ప్రాణం పోసింది. అలాగే బుచ్చిబాబు గారికి థాంక్ యూ. ఆయన విజన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ‘పెద్ది’ ఒక అద్భుతమైన సినిమా. జూన్ 4న మనమంతా థియేటర్లలో కలుద్దాం.
ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. భోపాల్ ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి సమక్షంలో ఈ ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమ దేశమంతటా ప్రేక్షకులను అలరిస్తుండటం గర్వంగా అనిపిస్తోంది. నేను సంగీతం అందించిన ఎన్నో చిత్రాలు తెలుగు డబ్ గా విడుదలయ్యాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నాపై అపారమైన ప్రేమ, ఆదరణ చూపించారు. చాలా కాలంగా నేరుగా ఒక తెలుగు సినిమాకు సంగీతం అందించాలని అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం రావడం ఆనందంగా ఉంది. బుచ్చిబాబు గారు ఈ కథను చెప్పినప్పుడు ఈ కథ, ఆయనలోని ప్యాషన్ నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన పాటలన్నింటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉంది. రామ్ చరణ్ గారు తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్‌తో నా పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ప్రతి మూమెంట్ వైరల్ అయింది. అలాగే జాన్వీ కపూర్ కూడా ఎంతో చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఈ ప్రేమాభిమానాలకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
రవి కిషన్ మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ గారు వంటి లెజెండ్ సమక్షంలో ఈ వేడుక జరగడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచారు. అలాగే జాన్వీ కపూర్ కూడా ఎంతో చక్కగా తన పాత్రను పోషించింది. మట్టిలో నుంచి ఎదిగి, తన కలలను నిజం చేసుకోవాలని పోరాడే ఓ యువకుడి కథ ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి రూపంలో మీరు ఒక గొప్ప నాయకుడిని చూస్తారు. ఆయన పాత్ర ప్రేక్షకులకు ఆశను, స్ఫూర్తిని అందిస్తుంది. ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్న సమయంలో కొన్ని సన్నివేశాలు చూసి నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఈ సినిమాతో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను. భారతదేశంలోని ప్రతి యువకుడు ఈ కథతో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు. ‘పెద్ది’ భారతదేశ యువతకు ఒక కొత్త హోప్ ని ఇచ్చే సినిమా. బుచ్చిబాబు గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. నేను ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో చిత్రాల్లో నటించాను. కానీ ‘పెద్ది’ మాత్రం ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకే సినిమా. జూన్ 4న మీరందరూ తప్పకుండా థియేటర్లలో ఈ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరుకుంటున్నాను.
క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి శ్రీ విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ.. భోపాల్ ప్రజలు కళాకారులను ఎంతో ప్రేమిస్తారు, గౌరవిస్తారు. రామ్ చరణ్ గారి ‘పెద్ది’ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వేడుకను భోపాల్‌లో నిర్వహించినందుకు రామ్ చరణ్ గారికి అభినందనలు. భవిష్యత్తులో ఈ చిత్ర బృందం భోపాల్‌లో కూడా షూటింగ్ నిర్వహించాలని కోరుకుంటున్నాను. మా సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది.
దివ్యేందు శర్మ మాట్లాడుతూ: ఇది నాకు ఎంతో ముఖ్యమైన సినిమా. ఈ చిత్రంతోనే నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఇంత ప్రేమ, ఆదరణ చూపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘పెద్ది’ ద్వారా కూడా మీ ఆశీర్వాదాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. రామ్ చరణ్ గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. బుచ్చిబాబు గారు అద్భుతమైన సినిమా తీశారు. ‘పెద్ది’ చూసిన తర్వాత మీ అందరికీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుంది.
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ .. నమస్తే భోపాల్. నాకు ఈ నగరంతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం కోసం భోపాల్ వచ్చాను. ఇక్కడ దాదాపు ఐదేళ్లు గడిపాను. అందుకే మధ్యప్రదేశ్‌ను మా రెండో ఇల్లుగా భావిస్తాను. ఇంత పెద్ద వేడుక కోసం మళ్లీ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ‘పెద్ది’ ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది. ఇది అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన గొప్ప స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమా కోసం మేమంతా రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి, ప్రాణం పెట్టి పనిచేశాం. జూన్ 4న మీ కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లలో ఈ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గారికి, అలాగే హాజరైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…