ఘనంగా ‘బ్లాస్ట్ జోన్’ ప్రెస్ మీట్.. మే 28న థియేటర్లలో భారీ విడుదల!

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించడం విశేషం. మే 28న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మాట్లాడుతూ.. “అందరికీ హృదయకపూర్వక నమస్కారాలు. ఈ ‘బ్లాస్ట్ జోన్’ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. సినిమా పూర్తయిన తర్వాత అవుట్ పుట్ చూసుకొని సంతృప్తి చెందే సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమా ‘బ్లాస్ట్ జోన్’. మన తల్లిదండ్రులకో, మన వాళ్ళకో అన్యాయం జరిగితే న్యాయం కోసం మనం ఖచ్చితంగా పోరాడతాం. అయితే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలి అనే సందేశాన్ని ఈ సినిమా చెబుతుంది. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఎదురు చూడకుండా, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలి? వంటి అద్భుతమైన అంశాలు ఇందులో ఉంటాయి. నేను ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేశాను. కానీ, ఈ సినిమాలో అభిరామి, ప్రీతి ముకుందన్ నాకంటే బాగా ఫైట్లు చేశారు. ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ‘బ్లాస్ట్ జోన్’ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రవి బస్రూర్ గారు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. నేపథ్య సంగీతం కోసం ఏకంగా 40-45 రోజులు కేటాయించారు. సాంకేతికంగా ప్రతి విభాగం అద్భుతంగా పని చేసింది. విజువల్స్ బాగుంటాయి. ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో నా పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా మా సుభాష్ కె రాజ్ వయసులో చాలా చిన్నవాడు కానీ, గొప్పగా సినిమాను తెరకెక్కించాడు. ఇది విభిన్నమైన చిత్రం. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ మా సినిమాను నిర్మించడం గర్వంగా ఉంది. అలాగే తెలుగులో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా నాగవంశీ గారు తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాను విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది. ఇది మీకు డబ్బింగ్ సినిమాలా అనిపించదు. ప్రతి పాత్ర మీకు కనెక్ట్ అవుతుంది. ఇది మహిళా సాధికారతకు కమర్షియల్ అంశాలు జోడించి చేసిన గొప్ప చిత్రం ‘బ్లాస్ట్ జోన్’. ఈ సినిమాను మీరందరూ మే 28న థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.

నటి అభిరామి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘బ్లాస్ట్ జోన్’ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మాస్ మూవీతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మాస్ క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు. ఒక చిన్న ఫైట్ కూడా చేయలేదు. సాధు మనిషిని నేను. అలాంటి నన్ను ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపించారు మా దర్శకుడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. గాయం కూడా అయింది. మీకు వినోదం అందించడం కోసం ఏమైనా చేయొచ్చు. టీమ్ అందరం ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాము. ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను. ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇదొక మాస్ మసాలా ఫిల్మ్. విజువల్స్, మ్యూజిక్, స్టంట్స్ అద్భుతంగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూసి అనుభూతి చెందాల్సిన సినిమా. మే 28న థియేటర్లలో ‘బ్లాస్ట్ జోన్’ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.

నటి ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ మే 28న థియేటర్లలో విడుదలవుతోంది. మీ అందరూ థియేటర్లో సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తెలుగు ట్రైలర్ పై ప్రేక్షకుల ఎంతో ప్రేమ కురిపించారు. ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. తెలుగులో మా సినిమాను విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కు ధన్యవాదాలు.” అన్నారు.

దర్శకుడు సుభాష్ కె రాజ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా నన్ను, నా కథను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన నిర్మాత అఘోరం గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో మీరు వింటేజ్ అర్జున్ గారిని చూస్తారు. తమిళ్ లాగానే తెలుగులో కూడా అర్జున్ గారికి ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ సినిమా అర్జున్ గారి అభిమానులకు ఒక ట్రీట్ లా ఉంటుంది. ప్రీతి ముకుందన్ గారు, అభిరామి గారు అద్భుతంగా నటించారు. ఈ సినిమాను నమ్మి, తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ‘బ్లాస్ట్ జోన్’ ట్రైలర్ కింద నేను కామెంట్స్ చూశాను. మీ అందరికీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని అర్థమైంది. మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. ‘బ్లాస్ట్ జోన్’ సినిమా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని ప్రతి పాత్ర మీకు కనెక్ట్ అవుతుంది.” అన్నారు.

అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఐశ్వర్య కల్పాత్తి మాట్లాడుతూ.. “తెలుగులో మా చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. భవిష్యత్ లో సితార భాగస్వామ్యంతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మా సినిమాకు మీడియా నుంచి లభిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. మీరందరూ మా సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

14 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago