సదా సినిమా, స్కై ఆర్ట్స్ పతాకాలపై గోణుగుంట్ల విజయ్ కుమార్ సమర్పణలో సదా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నంద`. కళ్యాణ్ ఎర్రగుంట్ల నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేంగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. చిత్ర కథానాయకుడు, దర్శకుడు మాట్లాడుతూ..“నేను హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో `నంద` చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నా. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది.
అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం మా చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ అర్జున్ మా చిత్రానికి నాలుగు అద్భుతమైన పాటలు సమకూర్చారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం “ అన్నారు.
డిఓపీః జైపాల్ రెడ్డి నిమ్మల; సంగీతంః చరణ్ అర్జున్; స్టంట్స్ః జీవన్ కుమార్; ఎడిటర్: పవన్ శేఖర్; కొరియోగ్రఫీః చంద్ర కిరణ్; కో-డైరక్టర్ః వరద గోవింద రాజు; పబ్లిసిటీ డిజైనర్ః వాసు ప్రేమ్; పీఆర్ ఓః జీకే మీడియా; నిర్మాతః కళ్యాణ్ ఎర్రగుంట్ల; స్టోరి,స్క్రీన్ ప్లే, దర్శకత్వంః సదా
&&&&&&&&&&