శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం చేస్తూ హీరో గా నటిస్తున్న చిత్రం “నమస్తే సేట్ జీ”.స్వప్న చౌదరి, సాయి కృష్ణ, శోభన్ భోగరాజు , చింతల శ్రీనివాస్ లు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కి తల్లాడ శ్రీనివాస్ నిర్మాత.విడుదల కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ “యూ” సర్టిఫికెట్ ని పొంది సెన్సార్ సభ్యుల ప్రశంసలు సైతం అందుకుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ హీరో తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “మేము చేసిన కష్టానికి ఫలితం ఈ సినిమా ద్వారా త్వరలో రాబోతుంది. సెన్సార్ సభ్యులు సైతం సినిమా బాగుంది అని మెచ్చుకున్నారు, సింగిల్ కట్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది, తెలుగు ప్రేక్షకులకు, కిరాణా షాప్ లో పని చేసే వ్యాపారస్తులకు ఖచ్చితంగా ఈ చిత్రం నచ్చుతుంది.ప్రముఖ లిరిసిస్ట్ చింతల శ్రీనివాస్, సంధ్య వర్శిని రచించిన పాటలు, వి.ఆర్.ఏ ప్రదీప్ అందించిన పాటలు, మా రామ్ తవ్వ అందించిన నేపథ్య సంగీతం ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో పలు అంశాలు అందరిని మెప్పిస్తాయి.త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని అన్నారు.
ఈ సినిమా కి ఎడిటింగ్- వివేకానంద విక్రాంత్
నిర్మాత – తల్లాడ శ్రీనివాస్
దర్శకత్వం- తల్లాడ సాయికృష్ణ
సంగీతం- వి.ఆర్.ఏ.ప్రదీప్, రామ్ తవ్వ
కథ మాటలు- శివ కాకు, రమేష్ కుమార్ వెలుపుకొండ,
డైరెక్షన్ టీం – పవన్ లునాటిక్, హానుమాద్రి శ్రీకాంత్, సతీష్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…