విరాట్ కర్ణ, అభిషేక్ నామా, కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా ఫిల్మ్ ‘నాగబంధం’- అద్భుతమైన శివాలయం సెట్‌లో గణేశ్ ఆచార్య మాస్టర్ కోరియోగ్రఫీలో హీరో విరాట్ కర్ణపై ‘ఓం వీర నాగ’ సాంగ్ షూటింగ్
యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నాగబంధంతో అలరించబోతున్నారు. విరాట్ తన పాత్ర కోసం ఎంతో డెడికేషన్ తో అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు.
నాగబంధం ఆధ్యాత్మికత, యాక్షన్, విజువల్ స్ప్లెండర్ మిళితమైన ఓ మ్యసీవ్ సినిమాటిక్ జర్నీ. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భక్తి, యాక్షన్, మిస్టరీని సమపాళ్లలో కలిపి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. స్కేల్, విజువల్స్, కాన్సెప్ట్.. ఇవన్నీ తెలుగు సినిమా సరిహద్దులను దాటేలా వుంటాయి.
బడ్జెట్ పరిమితులూ లేకుండా, ప్రేక్షకులను అబ్బురపరిచే సెట్‌లు, విజువల్స్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు భారతీయ సినీ తెరపై చూడని రీతిలో ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు నాగబంధం సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణగా నిలవనున్న డివోషనల్ సాంగ్ “ఓం వీర నాగ” ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో అత్యద్భుతంగా నిర్మించిన శివాలయ సెట్‌లో షూట్ చేస్తున్నారు. ఈ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ అద్భుతంగా రూపుదిద్దారు. అభే & జునైద్ కుమార్ గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ ఇచ్చారు, శ్రీ హర్ష లిరిక్స్ రాశారు. పాపులర్ బాలీవుడ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కోరియోగ్రఫీలో హీరో విరాట్ కర్ణపై ఈ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కార్తీక మాసంలో చిత్రీకరించడం ఆధ్యాత్మికతకు మరింత వైభవం జోడించింది.
సినిమా కథ భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుంది. శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న “నాగబంధం” అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ నడిచే ఈ కథ, పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో వుంటుంది.
ఈ చిత్రానికి సౌందర్ రాజన్ S సినిమాటోగ్రఫీ, ఆర్ సి ప్రణవ్ ఎడిటర్.
నాగబంధం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రమోషనల్ యాక్టివిటీస్ త్వరలో ప్రారంభం కానున్నాయి.
తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఈశ్వర్య మీనన్, జగపతి బాబ్, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్, తదితరులున్నారు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే, జునైద్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్
CEO: వాసు పోతిని
PRO : వంశీ శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…