ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ తో పాటు మంచి మెసేజ్ ఉన్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది – డైరెక్టర్ సంజీవ్ రెడ్డి

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శకుడు సంజీవ్ రెడ్డి.

  • నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో చీఫ్ మేనేజర్ గా పనిచేశాను. ఆ తర్వాత కృష్ణవంశీ గారి మహాత్మ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఫిలిం మేకింగ్ మీద ప్యాషన్ తో ఉండేవాడిని. హిందీలో నేను చేసిన ఇండిపెండెంట్ మూవీ లాగిన్ కు మంచి గుర్తింపు దక్కింది. అదే సినిమా తెలుగులో లేడీస్ అండ్ జెంటిల్ మేన్ సినిమాగా రీమేక్ చేశారు. అల్లు శిరీష్ హీరోగా ఏబీసీడీ, రాజ్ తరుణ్ తో అహా నా పెళ్లంట వెబ్ సిరీస్ లను రూపొందించాను. పలు యాడ్స్ కు డైరెక్షన్ చేశా, మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ ప్రభుత్వం కోసం చేసిన యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ప్రకటనలకు దర్శకత్వం వహించాను.
  • ఫెర్టిలిటీ ఇష్యూస్ మన సమాజంలో ఉన్నాయి. మేల్ ఫెర్టిలిటీ అనే సమస్య నేపథ్యంగా ఇప్పటిదాకా తెలుగులో మూవీ రాలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఇలాంటి ఇష్యూస్ తో బాధపడ్డారు. వారికి ఆధునిక వైద్యంతో పిల్లలు పుట్టినా, ఆ క్రమంలో వారు సొసైటీ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాను. ఈ కాన్సెప్ట్ తో సినిమా చేస్తే బాగుంటుందని “సంతాన ప్రాప్తిరస్తు” స్క్రిప్ట్ రెడీ చేశాను.
  • విక్రాంత్ గతంలో స్పార్క్ అనే మూవీ చేశాడు. అతనికి ఈ కథ చెప్పగానే నచ్చింది. ఇలాంటి ఇష్యూస్ గురించి తను కూడా విని ఉన్నాడు. నేను రైటర్ కల్యాణ్ రాఘవ్ “సంతాన ప్రాప్తిరస్తు” స్క్రిప్ట్ ను ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూసేలా ఉండాలని డిజైన్ చేశాం. ఎక్కువగా సమస్య గురించి చెబితే ఓవర్ డ్రామా అవుతుంది, ఈ కథను చెప్పడంలో కొంచెం హద్దు దాటినా బాగుండదు. అందుకే మేల్ ఫెర్టిలిటీ ఇష్యూను హ్యూమరస్ గానే చెప్పాలని అనుకున్నాం. మనకు బాలీవుడ్ లో ఇలాంటి మూవీస్ కొన్ని వచ్చాయి. ఫెర్టిలిటీ ఇష్యూ అనేది ఇది మాట్లాడకూడని అంశం కాదు, సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య.
  • ఇటీవల కోర్ట్ అనే మూవీ వచ్చి సక్సెస్ అందుకుంది, లిటిల్ హార్ట్స్ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాను మంచి కంటెంట్ తో చేస్తే ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం ఉంది. ఓటీటీల ట్రెండ్ వచ్చాక, కంటెంట్ బాగున్న సినిమాలను ఆడియెన్స్ తప్పకుండా సక్సెస్ చేస్తున్నారు. ఈ కథలో పెద్ద హీరోలు కూడా నటించవచ్చు. కానీ పెద్ద హీరోలంటే దర్శకుడిగా నా సక్సెస్, అవన్నీ చూస్తారు కదా.
  • మా మూవీని కొంతమంది ప్రొడ్యూసర్స్ ప్రివ్యూ చూశారు, బాగుందని చెప్పారు. మేల్ ఫెర్టిలిటీ ఇష్యూను మా కథలో చూపించడం వల్ల వాళ్లు ఎక్కడా ఇబ్బంది పడలేదు. ఆ విషయం మాతో చెప్పారు. అలాగే యూఎస్ కు ప్రింట్స్ పంపినప్పుడు అక్కడ ప్రింట్స్ కోసం వర్క్ చేసే ఆపరేటర్స్ మూవీ చూసి బాగుంది, మా ఫ్యామిలీతో వెళ్లి చూస్తామని జెన్యూన్ గా చెప్పడం హ్యాపీగా అనిపించింది. మా సినిమా ద్వారా ఒక సమస్యపై అవగాహన కల్పిస్తున్నాం, ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది.
  • “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకుంటుంది. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న కథలో చిన్న ఇష్యూను కూడా చూపిస్తున్నాం. మా సినిమాను చూసేందుకు పిల్లలు లేని కపుల్స్ గానీ, ఫ్యామిలీ ఆడియెన్స్ గానీ ఎక్కడా ఇబ్బంది పడరు. ఇష్యూపై ఉన్న రెస్పెక్ట్, కథను చెప్పే విధానంలో డిగ్నిటీతోనే వెళ్లాం. మేము ఇష్యూను ఎక్కడా ఫన్ చేయలేదు. ఇష్యూను ఎదుర్కొనే సందర్భాల్లో మాత్రం ఎంటర్ టైన్ మెంట్ క్రియేట్ చేశాం. హీరోకున్న లో స్పెర్మ్ కౌంట్ అనేది కథలో ప్రధానాంశం.
  • ఈ కథలో హీరోయిన్ గా తెలుగమ్మాయి అయితేనే బాగుంటుందని చాందినీ చౌదరిని తీసుకున్నాం. మ్యారీడ్ వుమెన్ గా నటించడానికి ఆమె ఏమాత్రం సందేహించలేదు. పైగా ఇలాంటి ఇష్యూను చెప్పడం నటిగా తన బాధ్యతగా భావించింది. తరుణ్ భాస్కర్ నటుడిగా తన పాత్రను వీలైనంత ఇంప్రూవ్ చేసి నటించారు. స్క్రీన్ ప్లే రైటింగ్ లో మంచి ఎక్సిపీరియన్స్ ఉన్న షేక్ దావూద్ మా మూవీకి చక్కని కథనాన్ని అందించారు. కథకు కాంట్రాస్ట్ ఉన్న టైటిల్స్ ప్రేక్షకులకు ఎక్కువకాలం గుర్తుంటాయి. మనకు పెళ్లి కాగానే సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. అలా ఈ టైటిల్ పెట్టాం. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీకి రావాలని కోరుతున్నాం.
  • మా సినిమాను ఇప్పటిదాకా చూసిన వాళ్లంతా అప్రిషియేట్ చేశారు. ఇదే ప్రశంసలు రేపు ప్రేక్షకుల నుంచి కూడా వస్తాయని ఆశిస్తున్నాం. ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది కాబట్టి ప్రేక్షకుల్ని మెప్పిస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యనే మాట్లాడుకునే అంశాన్ని ఓపెన్ గా డిస్కస్ చేస్తారనే అనుకుంటున్నాం. ఆ మార్పు తెచ్చేందుకు మొదటి అడుగు మా సినిమా అవుతుందని ఆశిస్తున్నాం.
TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

6 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

1 day ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago