యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య విభ్నమైన జానర్స్ తో అలరిస్తున్నారు. నాగశౌర్య కథానాయకుడిగా, నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కు
‘రంగబలి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈరోజు ఉగాది సందర్భంగా టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘రంగబలి’ అనే టైటిల్ చాలా ఇంట్రస్టింగా ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఫన్ రైడ్ గా ఈ సినిమా వుండబోతోందని అనౌన్స్ మెంట్ వీడియోని చూస్తే అర్ధమౌతోంది.
ఈ సినిమాలో నాగ శౌర్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం మేకోవర్ అయ్యారు. విలక్షణమైన కాన్సెప్ట్ లతో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అభిరుచి ఉన్న ఎస్ ఎల్ వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి అత్యంత గ్రాండ్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా కోసం పని చేస్తున్న మొత్తం టీమ్ సొంత ఊర్లు పేర్లు టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలో ప్రస్తావించడం ఆసక్తికరంగా వుంది.
ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సిహెచ్ సంగీత దర్శకుడు. ఎడిటర్ గా కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ పని చేస్తున్నారు. .
ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది . ప్రమోషన్లను ప్రారంభించడానికి మేకర్స్ ఉగాది పర్వదినాన్ని ఎంచుకున్నారు.
తారాగణం: నాగ శౌర్య
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్వీ సినిమాస్
సంగీతం: పవన్ సిహెచ్
డీవోపీ: దివాకర్ మణి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…