అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – టికెట్ ధర కేవలం 100,150 మాత్రమే

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుమతీ శతకం’ విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుండి మంచి అభినందనలు లభించాయి. సుభాష్ ఆనంద్ సంగీతం పాటలకు మరింత ప్రాముఖ్యతను పెంచింది. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే ప్రమోషన్స్ టూర్ లో చక్కటి స్పందన తెచ్చుకుంది సుమతి శతకం చిత్ర బృందం. అందరికీ అందుబాటు ధరలలో టికెట్లు ఉంటాయని తెలుపుతూ విడుదల తేదీ దగ్గరవుతున్న ఈ సమయంలో చిత్ర బృందం మీడియా వాడుతూ ఇంటరాక్ట్ అవుతూ ఇటీవలే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.

హీరో అమర్దీప్ చౌదరి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఒక సామాన్య స్థాయి నుండి మొదలై ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. నాకు వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించుకుంటూ ఇప్పుడు ఎంతో మహత్తరమైన అవకాశం సుమతీ శతకం ద్వారా మీ ముందుకు వచ్చాను. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నన్ను నేను నిరూపించుకుంటాను. నాకు ఈ సినిమాతోనే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో మీ అందరికీ మా దర్శక నిర్మాతలు గురించి చెప్పాలి. నాకంటే పెద్ద నటులు ఉన్నప్పటికీ నాకు అవకాశం ఇచ్చారు, దానికి నాకు ధన్యవాదాలు. చిన్న నాయుడు, ప్రదీప్ గారు ఈ సినిమాకు మరొక మూల స్థంభంగా నిలబడ్డారు. నాకు మంచి పాటలు రాసి, పాడి, సంగీతాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు. అలాగే నాతో ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరికీ థాంక్స్. అలాగే నేను రవితేజ గారు అంటే కేవలం ఇష్టం కాదు, ఆయన నాకు గురువు. ఆయన నా ఇన్స్పిరేషన్. సుమతీ శతకం ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది, ఎక్కడ బోర్ కొట్టదు. మమ్మల్ని అందరూ సపోర్ట్ చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. స్టార్ మా నాకు చాలా సపోర్ట్ చేశారు. రవితేజ గారితో ఉండే శ్రీను గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శైలికి తెలుగు రాకపోయినా చాలా కష్టపడి కొంత వరకు నేర్చుకుని సినిమాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర హీరోనే. ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉంటుంది. మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కన్నడలో కెవిఎన్, తమిళ్ లో జికె డిస్ట్రిబ్యూటర్స్ కి వారికి థాంక్స్” అన్నారు.

హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈ సినిమాలో నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం కష్టపడ్డాము. నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో నా పాత్ర పూర్తిగా రెవీల్ చేయలేదు కానీ సినిమాలో మీరు నా పాత్ర చూసి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. నాకు మీ అందరి ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు ఎం.ఎం. నాయుడు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. మా సినిమాను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా నిర్మాత సాయి సుధాకర్ గారు నాకు ప్రతి విషయంలో అండగా ఉన్నారు. నేను ఆయనకు రుణపడి ఉంటాను అనే మాట కూడా చాలా చిన్నది. సినిమాకు ఆయన ఇన్పుట్స్ తీసుకుని పని చేశాము. నాకు ఈ సినిమా ప్రయాణంలో నా సోదరుడు నాయుడు, అలాగే నా కోడైరెక్టర్ గారు ఒక గురువులా ఉండి నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సినిమా కథ అమర్దీప్ గారికి చాలా నచ్చి ఓకే చేశారు. ఆయన గాయపడి కూడా సినిమా కోసం ఎక్కడ వెనకడుగు వేయకుండా పని చేశారు. నటి శైలి గారు ఆరోగ్యం బాగున్న కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అదే విధంగా సినిమా కోసం కెమెరామెన్, సంగీత దర్శకులు అలాగే ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ చాలా కష్టపడి సినిమాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సినిమాను అందరూ సపోర్ట్ చేసి సినిమాకు మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత కొమ్మలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సుమతీ శతకం ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా పై మాకు నమ్మకం ఉంది. సెన్సార్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్, అలాగే కంటెంట్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ కు మంచి స్పందన లభించింది. మాతో పాటు విడుదల అవుతున్న సినిమాలు అన్నింటికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. అలాగే మా సినిమాను ఇరు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్న మైత్రి మూవీస్ కు, అలాగే కన్నడలో కెవిఎన్, తమిళ్ లో జికె డిస్ట్రిబ్యూటర్స్ కు థాంక్స్. మమ్మల్ని అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. టికెట్ ధర అందరికీ అందుబాటులో సింగిల్ థియేటర్ లో 100, మల్టీప్లెక్స్ లో 150 రూపాయిలు మాత్రమే ఉంటుంది” అన్నారు.

నటి శైలజ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ సినిమాలో పని చేసిన అందరినీ నేను నా బిడ్డలలా చూసాను. మాస్ మహారాజ్ రవితేజ గారి మొదటి సినిమా నుండి చూస్తున్నాము. ఆ రవితేజ వీరాభిమాని మన అమర్దీప్ చౌదరి సినిమా ఇప్పుడు మన ముందుకు వస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం సుమతీ శతకం. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ ఈ సినిమాను చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ… “నాకు ఈ సినిమాలో అవకాశం ఇచి నన్ను సొంత మనిషిలా చూసిన నిర్మాతకు నా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో కూడా బ్యాక్గ్రౌండ్ లో పని చేస్తూనే ఉన్నాము. ఈ సినిమాకు పాటలు రాసిన వారికి, పాడిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాతో నేను అమర్దీప్ ఫ్యాన్ అయిపోయాను. మరొక సారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ” అన్నారు.

నటుడు టేస్టీ తేజ మాట్లాడుతూ… “మా సుమతీ శతకం సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో మనకు తెర మీద కనిపించే హీరో అమర్దీప్ కాని కనిపించని హీరోలు మా నిర్మాత, దర్శకుడు, రచయిత అలాగే దర్శక బృందం. అలాగే సినిమాకు మంచి సంగీతం వచ్చింది. నాతో కూడా డాన్స్ చేయించారు. శైలి చౌదరి తెలుగు రాకపోయినా కష్టపడి నేర్చుకుని ఈ సినిమా కోసం పని చేశారు. అలాగే మా అమర్ ఈ సినిమాతో మంచి విజయం చూస్తాడు. ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది అమర్ వల్లనే. ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను ” అన్నారు.

జెడివి ప్రసాద్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మాకు అందరికీ ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. చిత్ర ట్రైలర్, టీజర్ చూసిన అందరూ చాల పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

రైటర్ నాయుడు మాట్లాడుతూ… “ముందుగా మా దర్శకుడు ఎంఎం నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిత్ర బృందం అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. యూత్, ఫ్యామిలీస్ అందరూ మా సినిమాను చూసి ఆశీర్వదిస్తారు అని కోరుకుంటున్నాను” అన్నారు.

నటీనటులు:
అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్ తదితరులు.

సాంకేతిక వర్గం:
బ్యానర్: విజన్ మూవీ మేకర్స్
నిర్మాత: సాయి సుధాకర్ కొమ్మాలపాటి
రచన, దర్శకత్వం: ఎంఎం నాయుడు
సినిమాటోగ్రాఫర్: ఎస్ హలేష్
సంగీతం: సుభాష్ ఆనంద్
ఎడిటర్: నహిద్ మహమ్మద్
పిఆర్ఓ: మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్: హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago