బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల “కలి” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “కలి” మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. “కలి” మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందని, ఒక కొత్త కాన్సెప్ట్ ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్ తో తెలుస్తోందని ఆయన అన్నారు. “కలి” మూవీ టీమ్ కు నాగ్ అశ్విన్ బెస్ట్ విశెస్ అందజేశారు.

చిత్ర సమర్పకులు కె. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ – ఈ రోజు “కలి” మూవీ టీజర్ ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. కలి పాత్ర నేపథ్యంతో సాగే ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే “కలి” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

ఈ చిత్ర నిర్మాత లీలా గౌతం వర్మ మాట్లాడుతూ – నాగ్ అశ్విన్ గారు ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చి “కలి” మూవీ టీజర్ ను లాంఛ్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం అని చెప్పారు. రచయిత మరియు డైరెక్టర్ శివ శేషు మాట్లాడుతూ “కలి” సినిమాను ఓ సరికొత్త కథాంశంతో రూపొందించాం. మైథాలజీ, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్స్ కలిపిన చిత్రమిది. “కలి” సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం. త్వరలోనే గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు మూవీని తీసుకురాబోతున్నాం. అన్నారు.

“కలి” మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

“కలి” మూవీ టీజర్ ఎలా ఉందో చూస్తే – స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునే సమయానికి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. శివరామ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్. పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు?. అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు?. అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి?. కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో “కలి” టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

నటీనటులు – ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.
టెక్నికల్ టీమ్:

సంగీతం – జీవన్ బాబు
ఎడిటర్ – విజయ్ కట్స్.
సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.
పాటలు – సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి,
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఫణీంద్ర
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి
నిర్మాత – లీలా గౌతమ్ వర్మ
రచన, దర్శకత్వం – శివ శేషు

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago