హీరోయిన్ నభా నటేష్ మంచి పర్ ఫార్మర్ అనే పేరు అటు ప్రేక్షకుల్లో ఇటు చిత్ర పరిశ్రమలో ఉంది. తన రీసెంట్ మూవీ “డార్లింగ్” తో ఈ గుర్తింపును మరింతగా పెంచుకుంది నభా నటేష్. ఈ సినిమాలో స్ప్లిట్ పర్సనాలటీ క్యారెక్టర్ లో నభా నటేష్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఐదారు వేరియేషన్స్ లో నటించి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తోంది నభా. ఆమె పాత్రకు ప్రేక్షకులు థియేటర్స్ లో బాగా కనెక్ట్ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ లోనే నభాకు ఇలాంటి మంచి క్యారెక్టర్ దొరకడం ఆ క్యారెక్టర్ లో ఆమె మెప్పించేలా పర్ ఫార్మ్ చేయడం విశేషమనే చెప్పుకోవాలి.
“డార్లింగ్” సినిమా ట్రైలర్ రిలీజ్ నుంచే నభా నటేష్ యాక్టింగ్ కు అప్రిషియేషన్స్ వచ్చాయి. ఇలాంటి పాత్రలో నటించాలనేది తన డ్రీమ్ గా చెప్పుకుందీ హీరోయిన్. “డార్లింగ్” సినిమాలో ప్రియదర్శితో కలిసి నభా నటేష్ నటించింది. ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించారు. గతవారం “డార్లింగ్” సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.
నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెపిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…
యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ) 30 వసంతాల సందర్బంగా…
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…