సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ గా “మిస్టీరియస్” సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – నిర్మాత జయ్ వల్లందాస్

రోహిత్ హీరోగా అబిద్ భూషణ్‌ పోలీస్ పాత్రలో నటించిన సినిమా “మిస్టీరియస్”.
రియా కపూర్ , మేఘనా రాజ్ పుత్ నటీనటులుగా మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో
అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో నిర్మాత జయ్ వల్లందాస్ తెలిపారు.

నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ

  • మా “మిస్టీరియస్” సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. నేను యూఎస్ లో ఉంటాను. సినిమా రంగం మీద ఆసక్తితో టాలీవుడ్ కు వచ్చాను. నా స్నేహితుడు మహి కోమటిరెడ్డిని దర్శకుడిని చేయాలనే సంకల్పంతో “మిస్టీరియస్” చిత్రాన్ని నిర్మించాను. ఈ మూవీ స్టోరీ మహి చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది. తొలి ప్రయత్నంలో ఒక కథా బలమున్న మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను నిర్మించడం సంతృప్తిగా ఉంది. మా మూవీ టైటిల్ బాగుందనే రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాను ఈ నెల 12నే రిలీజ్ చేయాల్సిఉంది. అయితే అఖండ 2 రిలీజ్ కారణంగా ఒక వారం ఆలస్యంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. 150 థియేటర్స్ కు పైగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.
  • ఇన్నోవేటివ్ స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా సాగుతూ ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుంది. సెన్సార్ నుంచి కూడా మా మూవీకి అభినందనలు దక్కాయి. ఒక డిఫరెంట్ సినిమా చేశారని వారు చెబుతూ..మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. మూవీలోని ప్రతి పాత్ర అనుమానాస్పదంగా అనిపిస్తుంది. చివరలో ఈ సస్పెన్స్ మిస్టరీని ఆకట్టుకునేలా ముగించారు మా దర్శకుడు మహి కోమటిరెడ్డి. కాన్ ఫ్లిక్ట్ లతో సాగే స్క్రీన్ ప్లేలో ఒక్కొక్కటిగా క్లూస్ ను వివరిస్తూ ఆద్యంతం మూవీ ఆసక్తికరంగా వెళ్తుంది. స్క్రీన్ నుంచి మీరు చూపు తిప్పుకోలేరు. అంతగా ప్రేక్షకులు మూవీకి కనెక్ట్ అవుతారని చెప్పగలను. చివరి 20 నిమిషాలు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠకు ఆడియెన్స్ లోనవుతారు.
  • అనేక మలుపులతో “మిస్టీరియస్” సినిమా ఉంటుంది. యాక్షన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్ గా నిలుస్తాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకునే చిత్రమిది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను నిర్మించాం. క్వాలిటీ పరంగా మా మూవీకి పేరొస్తుంది. మా సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా ఛాట్ బస్టర్ మ్యూజిక్ అందించారు. పోలీస్ ల గొప్పదనం చెప్పేలా రూపొందించిన అడుగు అడుగునా సాంగ్ ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారితో రిలీజ్ చేయించాం. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయినా పట్టుదలతో నిర్మించాం. ఇటీవల మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేసిన బ్రహ్మానందం గారికి థ్యాంక్స్ చెబుతున్నాం.
  • యంగ్ టీమ్ మా సినిమాకు పనిచేసింది. కాస్ట్ అండ్ క్రూ అంతా దాదాపు కొత్తవాళ్లే. ఇలాంటి యంగ్ టీమ్ చేసిన ప్రయత్నాన్ని తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని కోరుకంటున్నా. “మిస్టీరియస్” సినిమా తర్వాత టాలీవుడ్ లో వరుసగా చిత్రాలు నిర్మించాలనే ప్లాన్ చేస్తున్నాం. బాలరాజ్‌ వాడి, శ్రీనివాస్‌ భోగిరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు, సంగీతం: ఎమ్‌ఎల్‌ రాజా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహి కోమటి రెడ్డి.

TFJA

Recent Posts

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

1 day ago

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

1 day ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

1 week ago

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…

1 week ago

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 weeks ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 weeks ago