బ్లాక్‌బస్టర్‌ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ‘పతంగ్‌’ లో ఉన్నాయి: ట్రైలర్‌ ఆవిష్కరణలో దర్శకుడు దేవకట్టా

ప్రతిష్టాత్మక సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్‌’ ప‌తంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. పాపులర్‌ దర్శకుడు నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు.

ఈసందర్భంగా దేవ కట్టా మాట్లాడుతూ ‘ ట్రైలర్‌ ఎంతో ఎనర్జిటిక్‌,ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. రమ్య ఈ సినిమాకు వన్‌ ఆఫ్‌ ద ప్రొడ్యూసర్‌ అవ్వడం హ్యపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు ఈ సినిమా హీరో ప్రణవ్‌ సరిగమప నుంచి తెలుసు. ఇదొక కొత్తరకమైన సినిమా. ఈ సినిమా చాలా కష్టపడి తీశారు. ట్రైలర్‌ చూడగానే సూపర్‌ థ్రిల్ల్‌గా ఫీలయ్యాను. ఓ సూపర్‌హిట్‌ సినిమాకు. బ్లాక్‌బస్టర్‌ సినిమాకు కావాల్సిన ఆల్‌ ద ఎలిమెంట్స్‌ ఉన్నాయి. . పతంగ్‌ చూడగానే యూత్‌కు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఫ్రెండ్‌ షిప్‌ ఉంది. లవ్‌ ఉంది. గ్రేట్‌ మ్యూజికల్‌ ఎనర్జీ ఉంది. ఆర్టిస్టులు అందరూ ఎంతో ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా థియేటర్‌లో ఆడియన్స్‌ అలరిస్తుందనే నమ్మకం ఉంది. నిర్మాత నాని బండ్రెడ్డి గతంలో నేను ఆటోనగర్‌ సూర్య అప్పుడు హీరో ఎవరో తెలియనప్పుడు ఓ వాయిస్‌ టీజర్‌ వదిలాను. అది అప్‌లోడ్‌ చేశాను. దానికి మంచి స్పందన వచ్చింది. అప్పుడు వాయిస్‌ టీజర్‌కు పవన్‌కల్యాణ్‌ గారిని పెట్టి నాని ఓ ఎడిట్‌ చేశాడు. అది చూసిన పవన్‌ కళ్యాణ్‌ గారు నన్ను పిలిపించి నా కోసం రాసుకున్నావా ఈ కథ అన్నాడు. నాకు తెలియకుండానే నానితో ఈ అనుబంధ ఉంది. ఈ రోజు నాని ప్రొడ్యూస్‌ చేసిన సినిమాకు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. సినిమాకు హిట్‌ కళ కనిపిస్తుంది. ఈ సినిమా అందరికి మంచి పేరును తీసుకరావాలి అన్నారు. సహ నిర్మాత రమ్య వేములపాటి మాట్లాడుతూ పతంగ్‌ల పోటీ అనేది అందరికి చిన్నప్పడి నుంచి మంచి అనుబంధం ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా అందరికి కొత్త అనుభూతినిస్తుంది. రియలిస్టిక్‌ సినిమాటిక్‌ ఫీల్‌ను కలిగిస్తుంది’ అన్నారు.

వంశీ పూజిత్‌ మాట్లాడుతూ ” నేను ట్రైలర్‌ ఇప్పుడు చూశాను. మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించింది. పతంగుల కాంపీటిషన్‌ షాట్‌లు వీఎఫ్‌ఎక్స్‌లో అద్బుతంగా చేశారు. చివరి 30 నిమిషాలు పతంగ్‌ కాంపీటీషన్‌ ఏపిసోడ్‌ సూపర్‌గా ఉంటుంది. ఈ నెల 25న మా టీమ్‌ ప్రతిభ తెలుస్తుంది. ఈ సినిమాలో నా పేరు విస్కి. నేను పక్కా హైదరాబాదీ.. గ్రేట్‌ మాస్‌ పాత్ర. అందరూ నా పాత్రను లవ్‌ చేస్తారు. విస్కీ చాలా స్పెషల్‌. ది బెస్ట్‌ ఫిలిం ఈఇయర్‌కు ఇస్తున్నాం అనే నమ్మకం ఉంది. తెలుగు సినిమా గర్వంగా ఫీలయ్యే సినిమా ఇది. ఈ సినిమా విడుదల రోజు నా పుట్టినరోజు కావడం విశేషం. ప్రణవ్‌ కౌశిక్‌ మాట్లాడుతూ ” నా ఫస్ట్‌ ఫిలిం. దాదాపు మా ఆర్టిస్టులందరికి మొదటి సినిమా.. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా గట్స్‌ ఉండాలి. కరేజ్‌ కావాలి. మా ప్రొడ్యూసర్స్‌కు అవి ఉన్నాయి. ఈ సినిమాను పెద్ద సినిమాకు తగ్గకుండా చేశారు. కంటెంట్‌ పరంగా పెద్ద సినిమా ఇది. నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు హ్యపీగా ఉంది. వీఎఫ్‌ఎక్స్‌ కైట్స్‌ కాంపీటీషన్‌ షాట్స్‌ చాలా కష్టపడి చేశారు. ఈ నెల 25న నాకు అన్ని విధాల సపోర్ట్‌ చేసిన నా అమ్మ నాన్నకు హిట్‌ ఇవ్వబోతున్నాను అన్నారు.

వడ్లమాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇది నా వందో సినిమా. ఈ యూత్‌ఫుల్‌ బ్యాచ్‌తో చేసిన సినిమా ఇది. కొత్త ఎనర్జీ వచ్చింది. నాని బండ్రెడ్డి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. అసాధ్యుడు. చిన్న చినుకు ఏరులా మారుతుంది. ఈ ఏరు హోరు.. ఈ హోరు సముద్రంలా చినుకులా మొదలైన ఈ సినిమా మహా సముద్రం అంతా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈ ఇయర్‌ఎండ్‌ లో రాబోయే ఈ సినిమా వందల కోట్లు వసూలు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌ మోపిదేవి, సీఈవో ఆదినారాయణ, నాని బండ్రెడ్డి, నిర్మాత సంపత్ మక తదితరులు పాల్గొన్నారు.

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago