నా. నీ ప్రేమ కథ’ యూత్, ఫ్యామిలీ తప్పకుండా చూడాల్సిన చిత్రం

Must Read

నా.. నీ ప్రేమ కథ’  యూత్, ఫ్యామిలీ అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం: ప్రెస్ మీట్ లో ‘నా.. నీ ప్రేమ కథ’ టీమ్

అముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్  కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం తో పాటు టీఎఫ్పీసీ సెక్రటరి ప్రసన్న కుమార్ , రామకృష్ణ గౌడ్, శోభారాణి  పాల్గొన్నారు.

 ప్రెస్ మీట్ లో  ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘నా.. నీ ప్రేమ కథ’ ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా వున్నాయి. సినిమా చాలా బావొచ్చింది. టీం చాలా కస్టపడి ఈ సినిమా చేసింది. కొత్త దర్శకుడు నటుడు చాలా అంకితభావంతో పని చేశారు. చిన్న సినిమాలని ప్రోత్సహించాలి. ఈ  సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.

అముద శ్రీనివాస్ మాట్లాడుతూ.. యధార్ద సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. నటుడి గా దర్శకుడి పని చేయడం ఒక సవాల్. మా డీవోపీ తో పాటు చిత్ర బృందం అంతా ఎంతో సహకరించింది. నిర్మాత శ్రవణ్ కుమార్ కుమార్ గారు ఎక్కడా రాజీపడకుండా సినిమాకి కావాల్సింది సమకూర్చారు. ఇందులో హీరో పాత్ర పేపర్ బాయ్, హీరోయిన్ డాక్టర్. వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది ? అనేది చాలా ఆసక్తికరంగా వుంటుంది. ప్రేమ ఎలా అయినా పుట్టొచ్చు అనేది ఇందులో చిత్రీకరించాం. యూత్, ఫ్యామిలీ అందరూ చూడాల్సిన మూవీ ఇది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’’ అన్నారు.

నిర్మాత పోత్నాక్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. కథ విన్న వంటనే చాలా నచ్చింది. దర్శకుడికి పూర్తి స్వేఛ్చ ఇచ్చాను. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతల్లో ఈ చిత్రం షూటింగ్ జరిపాం. ఇందులో పని చేసిన అందరూ వారి పాత్రకు న్యాయం చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత మరిన్ని చిత్రాలు చేయాలనే ఆసక్తి కలిగింది. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా మంచి సినిమా. మీ అందరి ఆదరణ కావాలి’’ అన్నారు,  

శోభారాణి మాట్లాడుతూ.. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఎంతో అనుభవం వున్న నటుడు దర్శకుడిలా ఈ సినిమా చేశారు. టీజర్ ట్రైలర్ పాటలు చాలా బావున్నాయి.  మంచి రచన కనిపిస్తోంది. శ్రీనివాస్ చక్కగా నటించారు. శ్రీనివాస్ కి తనకంటూ ఒక గుర్తింపు వస్తుందనే నమ్మకం వుంది. నిర్మాత శ్రవణ్ కుమార్ గారికి అభినందనలు.చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఈ కథ చాలా బావుంటుంది.  ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఎంఎస్ కిరణ్ కుమార్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఎంఎల్ పి రాజా సంగీతం సమకూరుస్తుండగా చిన్నా నేపధ్య సంగీతం అందిసస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

నటీనటులు : అముద శ్రీనివాస్. కారుణ్య చౌదరి, రమ్య, అజయ్ ఘోష్, షఫీ, అన్నపూర్ణమ్మ, ఫిష్ వెంకట్ జబర్ దస్త్ ఫణి, నాగిరెడ్డి. బస్ స్టాప్ కోటేశ్వర రావు, మాధవి, వేములూరి రాజశేఖర్, హరి తదితరులు

టెక్నికల్ టీం :
నిర్మాత:  పోత్నాక్ శ్రవణ్ కుమార్
రచన, దర్శకత్వం: అముద శ్రీనివాస్
డివోపీ: ఎంఎస్ కిరణ్ కుమార్
సంగీతం : ఎంఎల్ పి రాజా
ఆర్ఆర్ : చిన్నా
ఎడిటర్ : నందమూరి హరి
పీఆర్వో : వంశీ శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News