డాక్టర్ గా వైద్యం – హీరోగా వినోదంఅందించాలన్నదే నా ధ్యేయం!!

డాక్టర్ టర్నెడ్ హీరో
పవన్ మహావీర్

ఆగస్టు 7 విడుదలకు సిద్ధమవుతున్న
“అమ్మా…….
నాకు ఆ అబ్బాయి కావాలి”

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ… ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. పవన్ మహావీర్ లండన్ లో వైద్య విద్య అభ్యసిస్తూ హీరోగా నటించడం విశేషం. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు!!

హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు – దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు సి.రాంప్రసాద్, శివనాగు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు. “ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని, పవన్ మహావీర్ కి ఇది పరిచయ చిత్రమంటే నమ్మడం కష్టమని” అతిధులు పేర్కొన్నారు. నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్ కి ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు.

నిర్మాత జి. శైలజరెడ్డి మాట్లాడుతూ… “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేసెందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు!!

డాక్టర్ టర్నెడ్ హీరో మహావీర్ మాట్లాడుతూ…. “డాక్టర్ గా వైద్యం… హీరోగా వినోదం అందించాలనే తన సంకల్పం కార్యరూపం దాల్చడానికి కారకురాలైన దేవతలాంటి మా అమ్మకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. ఈ చిత్రం ఇంత గొప్పగా రావడం కోసం మనసుపెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆగస్టు 7న మీ ముందుకు వస్తున్న “అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి” చిత్రాన్ని ఆదరించి, మా నుంచి మరిన్ని చిత్రాలు వచ్చేలా ప్రోత్సహించగలరు” అని అన్నారు!!

దర్శకుడు శివాల ప్రభాకర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత శైలజ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్లు వర్షిక, సుహానా… సక్సెస్ మీట్ లో మళ్లీ కలుస్తామని చెప్పి, ఈ చిత్రం సాధించబోయే సంచలన విజయం పట్ల తమకు గల నమ్మకాన్ని వ్యక్తం చేశారు!!

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: కిషోర్, ఫైట్స్; నందు, కొరియోగ్రఫీ : భాను మాస్టర్ – మొయిన్ మాస్టర్, సంగీతం: సాయి కార్తీక్, ఛాయాగ్రహణం: మహేందర్.ఎం., ఎడిటర్: నందమూరి హరి, కో-డైరెక్టర్: రావుశ్రీ, నిర్మాత: జి. శైలజ రెడ్డి, స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శివాల ప్రభాకర్!!

TFJA

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

10 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

11 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

11 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

11 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

11 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

17 hours ago